క్రీడాభూమి

ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో హీనా సిద్ధుకు గోల్డ్ మెడల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేన్‌నోవర్ (జర్మనీ), మే 14: ఇక్కడ జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ కాంపిటీషన్‌లో భాగంగా మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ హీనా సిద్ధు గోల్డ్ మెడల్ సాధించింది. మరో భారత షూటర్ శ్రీ వినేత రజతతో సరిపెట్టుకుంది. వచ్చే వారం మ్యూనిచ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్‌లో నిర్వహించే వరల్డ్ కప్ పోటీలో వీరు మరింత ఉత్సాహంగా పాల్గొంటారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్‌లో ఫ్రాన్స్‌కు చెందిన మథిల్డే లామోల్లెపై 239.8 పాయింట్లతో హీనా సిద్ధు గోల్డ్ మెడల్ సాధించింది. శ్రీ నివేత 219.2 పాయింట్లతో రజతం గెలుపొందింది. తాము తీసుకున్న కఠిన శిక్షణ ఉత్తమ పతకాలు సాధించేందుకు దోహదపడిందని, భవిష్యత్‌లో జరిగే పోటీల్లో మరింత దూసుకుపోయేందుకు ఇది ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ మ్యూనిచ్ వరల్డ్ కప్ పోటీలు ఈనెల 22 నుంచి 29వ తేదీవరకు జరుగుతాయి. గోల్డ్ కోస్ట్ కామనె్వల్త్ గేమ్స్‌తోపాటు కొరియాలో జరిగిన వరల్డ్ కప్‌లో రెండుసార్లు జరిగిన ప్రధాన ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించిన హీనా సిద్ధు మ్యూనిచ్‌లో కూడా మరో గోల్డ్ మెడల్ సాధించచడం ద్వారా హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.