క్రీడాభూమి

అజింక్య రహానేకు రూ.12 లక్షల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 14: రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ అజింక్య రహానెపై ఐపీఎల్ నిర్వాహకులు 12 లక్షల భారీ జరిమానా విధించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం ముంబయి వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాళ్లు నెమ్మదిగా ఓవర్లు వేశారు. అనుకున్న సమయంలో వారు ఇన్నింగ్స్‌ను పూర్తిచేయలేకపోయారు. ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధనను అతిక్రమించడం రాజస్థాన్‌కు ఇదే తొలిసారి. దీంతో రాజస్థాన్‌కు భారీ మొత్తంలో రూ.12 లక్షలు జరిమానా విధించామని టోర్నీ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుత ఐపీఎల్‌లో స్లో ఓవర్ కారణంగే జరిమానా విధించడం ఇది రెండోసారి. ఈ ఏడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ కారణంగా జరిమానా విధించడం ఇది రెండోసారి. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి రూ.12 లక్షలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.