క్రీడాభూమి

సత్తా చాటిన జూడోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 14: ఆసియా క్యాడెట్, జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు చక్కటి ప్రతిభను కనపరిచి సత్తాచాటారు. 12వ ఆసియా క్యాడెట్, 19వ ఆసియా జూనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 9 పతకాలు సాధించింది. వీటిలో మూడు స్వర్ణం, రెండు రజతం, నాలుగు కాంస్య పతకాలను భారత్ సొంత చేసుకుంది. భారత్ జూడోకారుల్లో రోహిణి సంభాజీ మోహితే (40 కేజీలు), తాబాబీ దేవి తన్‌జమ్ (44 కేజీలు) క్యాడెట్ విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. లేబనాన్‌లో ఈ చాంపియన్‌షిప్‌లో పోటీలు ఈనెల 10 నుంచి 13వరకు జరిగాయి. జూనియర్ విభాగంలో శివకుమార్ (55 కేజీలు), మోసిన్ గులాబ్ అలీ (60 కేజీలు) రజత పతకాలను గెలుచుకోగా, కృష్ణ ఫౌజ్‌ధార్ (44 కేజీలు), తులికామాన్ (78 కేజీలు) పాటు హర్ష్‌దీప్ సింగ్ బ్రార్ (81 కేజీలు) జూనియర్ క్యాటగిరిలో, హరీష్ (50 కేజీలు) క్యాడెట్ విభాగంలో కాంస్య పతకాలు గెలుపొందారు.