క్రీడాభూమి

22న మహిళల టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ముంబయి వాంఖడే స్టేడియంలో నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు ఈనెల 22న మహిళల టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. గత ఏడాది ప్రపంచ కప్‌లో సాధించిన అఖండ విజయం తర్వాత భారత మహిళా క్రికెట్‌కు జనాదరణ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీ-20 వంటి చాలెంజ్ మ్యాచ్‌ల నిర్వహణ ద్వారా చక్కని ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఇది భవిష్యత్తులో మహిళా క్రికెట్‌లో సైతం పురుషుల ఐపీఎల్ తరహాలో నిర్వహించేందుకు దారితీస్తుందని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డాడు. ఇంతవరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లు జనాదరణ పొందడంతో మహిళా క్రికెట్‌ను మరింత ప్రోత్సహించేందుకు వీలుగా టీ-20 మ్యాచ్‌లు దోహదపడతాయని ఆయన పేర్కొన్నాడు. ఈనెల 22న నిర్వహించే మహిళల టీ-20 చాలెంజ్ మ్యాచ్‌లలో రెండు టీమ్‌లు ఉంటాయని, ఒకదానికి స్మృతి మంధాన, మరో టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా మహిళల జరుగుతున్న టీ-20 మ్యాచ్‌ల ద్వారా ఎంతోమందికి అపార అవకాశాలు వస్తున్నాయని, తద్వారా ఈ పోటీలకు జనబాహుళ్యంలో మరింత ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నాడు. ఈ విషయమై ప్రపంచంలోని వివిధ క్రికెట్ బోర్డు యాజమాన్యాలతో చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నామని ఆయన పేర్కొన్నాడు. ఈనెల 22న నిర్వహించే టీ-20 మ్యాచ్ భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ప్రసారం కానుంది. కాగా, కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) సభ్యురాలు, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ మాట్లాడుతూ భారత మహిళా క్రికెటర్లను భాగస్వాములుగా చేస్తూ తొలిసారిగా ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ముంబయిలో నిర్వహించనున్నామని, ఇది భవిష్యత్తులో ఐపీఎల్ తరహా మ్యాచ్‌ల నిర్వహణకు ఎం తో ఉపకరిస్తుందని తెలిపింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలైసె పెర్రీ, వికెట్ కీపర్/బ్యాట్స్ ఉమన్ ఎలైస్సా హీలే, మెగాన్ స్కట్, బెత్ మూనే వంటివారితోపాటు ఇంగ్లాండ్‌కు చెందిన డానీ వ్యాట్, డేనియల్ హజెల్ తదితరులు ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు అంగీకారం తెలిపారు.