క్రీడాభూమి

అప్పుడు ఇండిపెండెంట్.. ఇప్పుడు ఏకగ్రీవంగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 15: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా బీసీసీఐ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. మరోసారి మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ట్విట్టర్ ద్వారా ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ కౌన్సిల్ ఆమోదముద్ర వేయడంతో బోర్డు డైరెక్టర్లు అంద రూ ఆయన ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుందని ఐసీసీ ప్రకటించింది. మనోహర్ స్వతంత్రంగా పోటీ చేసి 2016లో చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. గత రెండేళ్లలో ఐసీసీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. ఎన్నడూ లేనివిధంగా ఐసీసీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పరిపాలన పద్ధతిని సవరించడంతో పాటు ఐసీసీలోప్రథమంగా ఒక మహిళకు డైరెక్ట ర్ బాధ్యతలు అప్పగించి అందరి మన్ననలు పొందాడు. 2016లో ఎన్నికైన శశాం క్ పదవీ కాలం ఇటీవలే ముగియడంతో మరోసారి ఆయన్ను ఎన్నుకున్నట్లు ఐసీసీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనికి బోర్డు డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో మనోహర్ తిరిగి చైర్మన్‌గా నియమితులయ్యాడు. దీంతో ఐసీసీలో మం చిపేరు తెచ్చుకున్న ఆయన రెండోసారి కూడా చైర్మన్‌గా ఎన్నికై పలువురి మన్ననలు పొందాడు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ క్రికెట్‌ను ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచ క్రీడగా తీర్చిదిద్దామని చెప్పాడు. తనకు మద్దతిచ్చిన సహచర డైరెక్టర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆయన గత రెండు సంవత్సరాలుగా కలిసికట్టుగా పనిచేయడంతో సత్ఫలితాలు సాధించామన్నాడు. రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవడం అనందం, సంతోషంగా ఉందన్నాడు. శశాంక్ తమ చైర్మన్‌గా రెండోసారి ఎన్నికవ్వడంపై ఇతర డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేస్తూ క్రికెట్ అభివృద్ధికి మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని సూచించారు. బీసీసీఐ చైర్మన్‌గా నియమితులైన మనోహర్‌ను బీసీసీఐతో పాటు క్రికెటర్లు, ప్రముఖులు అభినందనలు తెలిపారు.