క్రీడాభూమి

పాక్ చీఫ్ సెలెక్టర్ రేసులో ఇంజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 15: పాకిస్తాన్ క్రికెట్ చీఫ్ సెలెక్టర్‌ను ఎంపిక చేసేందుకు పిసిబి (పాక్ క్రికెట్ బోర్డు) తన అనే్వషణను ముమ్మరం చేసింది. ఈ పదవిని చేపట్టేందుకు పాక్ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. దీంతో ఈ పదవి కోసం రేసులో ఉన్న ఆశావహుల జాబితాలో ఇంజమామ్ పేరును కూడా చేర్చి ఆ జాబితాను పిసిబి మరింత పొడిగించింది. చీఫ్ సెలెక్టర్‌గా ఇంజమామ్ లేదా రషీద్ లతీఫ్‌కు బాధ్యతలు అప్పగించే విషయమై వారిద్దరితో బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ చర్చలు జరుపుతున్నట్లు పిసిబికి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘చీఫ్ సెలెక్టర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై ఇప్పటివరకూ తుది నిర్ణయం జరగలేదని కచ్చితంగా చెప్పగలను. ఈ పదవిని ఆశిస్తున్న అభ్యర్థులతో ప్రస్తుతం షహర్యార్ ఖాన్ చర్చలు జరుపుతున్నాడు. వీరిలో ఇంజమామ్, రషీద్ కూడా ఉన్నారు. అయితే చీఫ్ సెలెక్టర్ పదవికి ఇప్పటికే ఇంజమామ్ పేరును ఖరారు చేశారన్న మాటలో నిజం లేదు’ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు తెలిపాడు. చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు ఇంజమామ్ ఆసక్తిని వ్యక్తం చేశాడని, అయితే ఇంజమామ్‌కు ఈ పదవిని అప్పగించేందుకు రెండు అడ్డంకులు ఉన్నాయని ఆ అధికారి చెప్పాడు. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలు అందిస్తున్న ఇంజమామ్ తద్వారా నెలకు 12 వేల డాలర్ల వేతనాన్ని అందుకుంటున్నాడు. అయితే పాక్ చీఫ్ సెలెక్టర్ పదవిని ఇంజమామ్‌కు అప్పగించాలంటే అతను అఫ్గాన్ జట్టు కోచ్ పదవిని వదిలేయాల్సి ఉంటుందని, అలాగే ఇంజమామ్‌ను చీఫ్ సెలెక్టర్‌గా నియమించాలనుకుంటే పాక్ క్రికెట్ బోర్డు అతనికి నెలకు కనీసం 12 వేల డాలర్లకు తగ్గకుండా వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుందని, కానీ ఈ రెండు అడ్డంకులపై ఇప్పటివరకూ తుది నిర్ణయం జరగలేదని ఆ అధికారి వివరించాడు.
పాకిస్తాన్‌కు అత్యధికంగా 120 టెస్టులు, 398 అంతర్జాతీయ వనే్డ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన ఇంజమామ్ ఉల్‌హక్, టీమిండియా మాజీ పేస్ బౌలర్ మనోజ్ ప్రభాకర్‌తో కలసి గత ఏడాది అఫ్గానిస్తాన్ జట్టు ప్రధాన కోచ్‌గా చేరిన విషయం తెలిసిందే. క్రికెట్‌లో ‘పసికూన’గా పరిగణించే అఫ్గాన్ జట్టుకు ఇటీవల కొన్ని చక్కటి విజయాలను అందించడంలో వీరు సఫలీకృతులయ్యారు.
ఇదిలావుంటే, పాక్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు గతంలో విముఖత వ్యక్తం చేసిన రషీద్ లతీఫ్ ఆ పదవి పట్ల తనకు ఆసక్తి లేదని ఇప్పుడు మరోసారి పునరుద్ఘాటించాడు. అయితే చీఫ్ సెలెక్టర్ ఎంపిక కోసం పాక్ క్రికెట్ బోర్డు ఇంజమామ్, రషీద్‌లతో పాటు మాజీ టెస్టు ఓపెనర్ మొహిసిన్ ఖాన్, మాజీ స్పిన్నర్ ఇక్బాల్ ఖాసిం పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పిసిబి వర్గాలు తెలిపాయి.