క్రీడాభూమి

టీమిండియాకు మా సత్తా చూపిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: టీమిండియా బ్యాట్స్‌మెన్‌లను ఎ దుర్కోగల సత్తా తమ స్పిన్నర్లకు ఉందని అఫ్గనిస్తాన్ క్రికె ట్ కెప్టెన్ అస్గర్ స్టానిక్‌జాయ్ అన్నాడు. బెంగళూరు చి న్నస్వామి స్టేడియంలో జూన్ 14 నుంచి జరుగనున్న టెస్టు మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్‌లకు గట్టి పోటీ ఇ స్తామని, ఇందుకు తమ స్పిన్నర్లపై తనకు ఎంతో నమ్మ కం ఉందని ఆయన పేర్కొన్నాడు. మంగళవారం ఇక్కడ పీటీఐతో ఆయన మాట్లాడుతూ ఆ మ్యాచ్‌లో టీమిండియాకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నా లేకున్నా స్వదేశీ గడ్డపై ఆడుతున్న ఆ టీమ్ చాలా బలమైనదిగా తాము విశ్వసిస్తామని ఆయన అన్నాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రికెటర్లలో ఒకడైన విరాట్ కోహ్లీతో తలపడాలని తాము ఎంతోకాలం నుండి ఉవ్విళ్లూరుతున్నామని ఆయన అన్నాడు. అయితే, పోటీలో ఎవరు ఉన్నా తమకెలాంటి భయం లేదని, టీమిండి యా ఎంతటి బలమైనదో అందరికీ తెలిసిందేనని, అ యితే, ఆ టీమ్ క్రికెటర్లను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచ స్థాయి సత్తా కలిగిన స్పిన్నర్లు ఉండడం తమకు కలిసొచ్చే అంశమని, వారు భారత క్రికెటర్లను తమ స్పిన్ మాయాజాలంతో ఇబ్బందులు పెట్టగలరని అన్నాడు. స్పిన్నర్ల అనుభవాన్నంతా రంగరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గెలుపు దిశగా దూసుకుపోతామనే నమ్మకం తమకు ఉందని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం అఫ్గనిస్తాన్ జట్టు గ్రేటర్ నొయిడాలో శిక్షణ పొందుతోంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరిగే మూ డు టీ-20 మ్యాచ్‌లలో తలపడనుంది. ఇందుకు అనుగుణంగా జట్టు కోచ్ ఫిల్ సిమోన్స్ జట్టును మానసికంగా, శారీరకంగా సన్నద్ధం చేస్తున్నాడు. తాము ప్రతి ఏడాది ఎన్నో మ్యాచ్‌లు ఆడుతున్నా టెస్టు క్రికెట్ ఆడ డం చాలా భిన్నమని అభిప్రాయపడ్డాడు. తమ టీమ్‌లో కీలక స్పిన్నర్లుగా వినుతికెక్కిన రషీద్ ఖాన్, ముజీబ్ జడ్రాన్, ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ప్రస్తుతం ఐపీఎల్‌లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అద్భుతంగా రాణిస్తున్నారని గుర్తుచేశాడు. అదేవిధంగా ముజీబ్, జహీర్ ఖాన్, క్వాసీ అహ్మద్ వంటి వారు కూడా బాగా పరిణితి చెందారని, పేసర్లు ధావ్‌లాత్, షాపూర్ జద్రాన్ వంటి వారు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవారని, ఇలాంటివారి సహకారంతో టీమిండియాపై పైచేయి సాధించగలమనే నమ్మ కం తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.