క్రీడాభూమి

4-20-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ప్లే ఆఫ్ బెర్త్ కోసం రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆతిధ్య జట్టు బౌలర్ కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి రాజస్థాన్ వెన్ను విరిచాడు. నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలుత టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ను ప్రారంభించిన రాజస్తాన్ 18.1 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ త్రిపాఠి, జోస్ బట్లర్ మంచి శుభారంభాన్ని అందించినా అది ఎక్కువ సేపు నిలబడలేదు. రాహుల్ త్రిపాఠి 15 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, నాలుగు బౌండరీల సహాయంతో 27 పరుగులు చేసి ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్ అజింక్య రహానే 12 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 11 పరుగులు చేసి బౌల్డ్ అయ్యాడు. 22 బంతులు ఎదుర్కొన్న వికెట్ కీపర్ జోస్ బట్లర్ రెండు సిక్సర్లు, ఐదు బౌండరీల సహాయంతో 39 పరుగులు చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సియర్‌లెస్‌కు క్యాచ్ ఇచ్చి బట్లర్ వెనుతిరిగాడు. సంజూ శాంసన్ 10 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 12 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. స్టువర్ట్ బిన్నీ నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంపవుట్ అయ్యాడు. కృష్ణప్ప గౌతమ్ ఐదు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి శివమ్ మావి బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. బెన్ స్టోక్స్ 13 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చాడు. ఇష్ సోధి ఆరు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి ప్రసీధ్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న జోఫ్రా ఆర్చెర్ ఒక బౌండరీతో ఆరు పరుగులు చేసి ఆండ్రూ రస్సెల్ బౌలింగ్‌లో శుభ్‌మాన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. జయదేవ్ ఉనద్కత్ 15 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో మూడు ఫోర్లతో 24 పరుగులు, అనురీత్ సింగ్ రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఆండ్రూ రస్సెల్ మూడు ఓవర్లలో 13 పరుగులిచ్చి రెండు వికెట్లు, శివమ్ మావి నాలుగు ఓవర్లలో 44 పరుగులు, ప్రసీద్ కృష్ణ 3.1 ఓవర్లలో 32 పరుగులు, సునీల్ నరైన్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన నిర్ణీత 139 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన కోల్‌కతా 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. సునీల్ నరైన్ ఏడు బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లు, మరో రెండు బౌండరీల సహాయంతో 21 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో గౌతమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆరు బంతులు ఎదుర్కొన్న రాబిన్ ఉతప్ప నాలుగు పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో ఆర్.త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. నితీష్ రాణా 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో రెండు బౌండరీల సహాయంతో 21 పరుగులు చేసి ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. క్రిస్ లీన్ 42 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఐదు బౌండరీల సహాయంతో 45 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అనురీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. కెప్టెన్/వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 31 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మరో ఐదు ఫోర్లతో 41 పరుగులు, ఆండ్రూ రస్సెల్ ఐదు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

సంక్షిప్త స్కోరు:
రాజస్థాన్ రాయల్స్: 18.1 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 138.
(జోస్ బట్లర్ సి సియర్లెస్ బి కుల్దీప్ యాదవ్ 39, రాహుల్ త్రిపాఠి సి దినేష్ కార్తీక్ బి ఆండ్రూ రస్సెల్ 27, జయదేవ్ ఉనద్కత్ నాటౌట్ 24, కుల్దీప్ ఉనద్కత్ 4/20).
కోల్‌కతా నైట్‌రైడర్స్: 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 145 (క్రిస్ లీన్ సి అనురీత్ సింగ్ బి బెన్ స్టోక్స్ 45, నితీష్ రాణా ఎల్‌బీడబ్ల్యూ ఇష్ సోధి 21, సునీల్ నరైన్ సి గౌతమ్ బి బెన్ స్టోక్స్ 21, దినేష్ కార్తీక్ నాటౌట్ 41, ఆండ్రూ రస్సెల్ నాటౌట్ 11, బెన్ స్టోక్స్ 3/15).

చిత్రాలు..వికెట్ తీసిన ఆనందంలో కుల్దీప్ యాదవ్
*రాజస్థాన్‌పై కోల్‌కతా గెలుపు సంబరం