క్రీడాభూమి

బెంగళూరు బెంగ తీరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 16: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో దాదాపు ప్లే ఆఫ్‌పై ఆశలు సన్నగిల్లే స్థితిలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గురువారం తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే పోరు చావోరేవో తేల్చనుంది. ఏవిధంగా చూసుకున్నా ఈ రెండు జట్లలో సన్‌రైజర్స్ అన్నివిధాల పైచేయిగానే ఉంది. మొత్తం ఎనిమిది ఐపీఎల్ జట్లలో మిగిలిన టీమ్‌లను తోసిరాజని అగ్రస్థానంలో కొనసాగుతున్న కెప్టెన్ విలియమ్‌సన్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ఇంతవరకు 12 మ్యాచ్ ఆడగా, వాటిలో తొమ్మిదింట్లో విజయం సాధించి, మరో మూడింట్లో పరాజయాలను చవిచూసింది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో తొలి స్థానాన్ని ఆక్రమించింది. ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు మొత్తం ఐపీఎల్ జట్లలో ఏడో స్థానానికే పరిమితమైంది. ఇంతవరకు 12 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం ఐదింట్లో విజయం సాధించి, మరో ఏడింట్లో పరాజయాన్ని ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో కేవలం 10 పాయింట్లలో నిలిచింది. ఈనెల 12న ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో గెలిచిన బెంగళూరు, 14న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. వరుస వైఫల్యాలతో అవస్థలు పడుతున్న కోహ్లీ టీమ్‌కు ఢిల్లీ, పంజాబ్‌లపై వరుస విజయాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇదే ఊపుతో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచి విజయాన్ని తమ ఖాతాలో నోమోదు చేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీతోపాటు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కలసి మొత్తం బెంగళూరు టీమ్ సభ్యులంతా కలసి సాధించిన పరుగుల్లో దాదాపు అర్ధ భాగం పరుగులు (కోహ్లీ 514, డివిలియర్స్ 358) సాధించారు. అయితే, ఈ జట్టులోని మోరుూన్ అలీ, ఆండర్సన్ వంటివారు పరుగుల వరద సృష్టించడంలో విఫలమవుతున్నారు. ఈ జట్టుకు మరో బలమైన ఆయుధం ఉమేష్ యాదవ్. ఇంతవరకు అతను ఆడిన మ్యాచ్‌లలో మొత్తం 17 వికెట్లు తీసుకున్నాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మూడు మ్యాచ్‌లలో ఘన విజయం సాధించి, ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత మరో ఏడు మ్యాచ్‌లలో అప్రతిహతంగా దూసుకుపోయింది. ఈనెల 13నన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో దొర్లిన పొరపాట్లను సరిదిద్దుకుని గురువారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించే దిశగా కెప్టెన్ విలియమ్‌సన్ ప్రణాళిక రచిస్తున్నాడు. హైదరాబాద్ టీమ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఇంతవరకు 544 పరుగులు, స్టయిలిష్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ 369 పరుగులు చేశారు.
ప్రస్తుత లీగ్‌లో సన్‌రైజర్స్‌ను అగ్రపథానికి తీసుకెళ్లడానికి కెప్టెన్ విలియమ్‌సన్ కృషి చెప్పనలవికాదు. యూసుఫ్ పఠాన్ 186, మనీష్ పాండే 189, షాకీబ్ అల్ హసన్ 166 పరుగులతో జట్టును అడపాదడపా ఆదుకుంటున్నారు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇంతవరకు 8 వికెట్లు తీసుకోగా, సిద్ధార్థ కౌల్ 13, సందీప్ శర్మ 8, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 13, షాకీబ్ అల్ హసన్ 12 వికెట్లు సాధించడం ద్వారా జట్టుకు బలమైన ఆయుధాలుగా నిలబడ్డారు. బ్యాటింగ్ కంటే బౌలింగ్‌లోనే హైదరాబాద్ బలంగా ఉండడంతో ప్రత్యర్థిని నిలువరించేందుకు వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు కెప్టెన్ పావులు కదుపుతున్నాడు.