క్రీడాభూమి

‘మాంటే కార్లో మాస్టర్స్’లో ఫెదరర్‌కు సోంగా చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంటే కార్లో, ఏప్రిల్ 15: మాంటే-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, ఫ్రాన్స్‌కు చెందిన జో-విల్‌ఫ్రెడ్ సోంగా, గేల్ మోన్‌ఫిల్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. అయితే స్విట్జర్లాండ్‌కు చెందిన దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్‌కు క్వార్టర్ ఫైనల్స్‌లోనే చుక్కెదురైంది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఫెదరర్ శుక్రవారం పురుషుల సింగిల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ పోరులో ఎనిమిదో సీడ్ జో-విల్‌ఫ్రెడ్ సోంగా చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మ్యాచ్ ఆరంభంలో బాగానే ఆడి తొలి సెట్‌ను 6-3 తేడాతో గెలుచుకున్న ఫెదరర్‌కు ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. ఫలితంగా ఫెదరర్ 2-6, 5-7 తేడాతో వరుసగా రెండు సెట్లను చేజార్చుకుని ఓటమిపాలయ్యాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జరిగిన ఇతర మ్యాచ్‌లలో ఆండీ ముర్రే, రాఫెల్ నాదల్, గేల్ మోన్‌ఫిల్స్ సునాయాసంగా తమ ప్రత్యర్థులను ఓడించారు. ఈ టోర్నీలో 2వ సీడ్‌గా బరిలోకి దిగిన ముర్రే 6-2, 6-0 తేడాతో కెనడాకు చెందిన పదో సీడ్ ఆటగాడు మిలోస్ రవోనిక్‌ను మట్టికరిపించగా, మూడో సీడ్ రాఫెల్ నాదల్ 6-1, 6-4 తేడాతో స్విట్జర్లాండ్‌కు చెందిన నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకాను చిత్తు చేశాడు. అలాగే మరో మ్యాచ్‌లో 13వ సీడ్ గేల్ మోన్‌ఫిల్స్ 6-2, 6-4 తేడాతో స్పెయిన్ ఆటగాడు మార్సెల్ గ్రానోలర్స్‌పై విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లాడు.
బొపన్న జోడీ ముందంజ
ఇదిలావుంటే, ఈ టోర్నీలో భారత ఆటగాడు రోహన్ బొపన్న, అతని భాగస్వామి ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా) క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఆరో సీడ్ జోడీగా బరిలోకి దిగిన వీరు పురుషుల డబుల్స్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లో 7-5, 7-5 తేడాతో రాబర్ట్ లిండ్‌స్టెడ్, అలెగ్జాండర్ పెయా జోడీని మట్టికరిపించారు. 87 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో బొపన్న, మెర్గియా నాలుగుసార్లు ప్రత్యర్థుల సర్వీసును బ్రేక్ చేయడంతో పాటు నాలుగు ఏస్‌లను సంధించారు. సెమీఫైనల్‌లో స్థానం కోసం వీరు నాలుగో సీడ్ జేమీ ముర్రే, బ్రూనో సోరెస్ జోడీతో తలపడనున్నారు.

‘స్విస్ మాస్టర్’ రోజర్ ఫెదరర్‌పై
విజయం సాధించిన జో-విల్‌ఫ్రెడ్ సోంగా