క్రీడాభూమి

రెండు స్థానాలకే పోటీ తీవ్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొదటి నాలుగు స్థానాల్లో రెండు స్థానాలు ఇప్పటికే ఖాయమయ్యాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే సూపర్ ఫోర్‌లో చోటు దక్కించుకున్నాయి. దీనితో మిగతా రెండు స్థానాల కోసం హోరాహోరీ పోరు కొనసాగనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు సూపర్ ఫోర్‌పై ఆశతో ఉన్నాయ. శనివారం హైదరాబాద్‌లో జరిగే కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొంటున్న నైట్ రైడర్స్‌కు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో ఓడితే, ఇంటిదారి పట్టడం ఖాయం. గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడినప్పటికీ, సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది వాస్తవం. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న ఈ జట్టు బెంగళూరుపై 219 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి క్షణం వరకూ చేసిన పోరాటం అద్వితీయం. పరుగుల వేటలో విఫలమై, 14 పరుగుల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ, కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోవడం సన్‌రైజర్స్ బ్యాటింగ్ బలానికి అద్దం పడుతున్నది. బౌలింగ్‌ను కొంత మెరుగు పరచుకుంటే, కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలోని ఈ జట్టు మరింత బలోపేతమవుతుంది. ఫైనల్‌లో చోటు కోసం పోటీపడే అవకాశాన్ని ఇప్పటికే చేజిక్కించుకున్న సన్‌రైజర్స్‌కు నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్ ఫలితంతో ఎలాంటి లాభంగానీ, నష్టంగానే ఉండదు. అయితే, హోం గ్రౌండ్‌లో, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో మ్యాచ్‌ని గెలిచి, మొదటి క్వాలిఫయర్‌లో ఆడేందుకు సిద్ధం కావాలన్న పట్టుదలతో సన్‌రైజర్స్ మైదానంలోకి దిగనుంది.
సన్‌రైజర్స్ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఆడుతుంటే, శనివారం నాటి మ్యాచ్ నైట్ రైడర్స్‌కు కఠిన పరీక్ష కానుంది. సమర్థులు ఉన్నప్పటికీ, ఈసారి ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ జరిగిన 13 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలను మాత్రమే నమోదు చేసుకోగలిగింది. ఆరు పరాయాలను ఎదుర్కొని, ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉన్న ఈ జట్టు కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేతిలో ఓడితే, మిగతా మ్యాచ్‌ల ఫలితాలు, నెట్ రన్‌రేట్ వంటి అంశాలపై సూపర్ ఫోర్‌కు చేరే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. దినేష్ కార్తీక్ నాయకత్వం వహిస్తున్న నైట్ రైడర్స్ గెలుస్తుందా? లేదా? అనేది పక్కకు ఉంచితే, ఓ యుద్ధాన్ని తలపించే మ్యాచ్‌ని చూసే అవకాశం హైదరాబాద్ ప్రేక్షకులకు దక్కనుంది.
ఐపీఎల్‌లో ఫైనల్ చేరడమే లక్ష్యంగా శ్రమిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ శనివారం జరిగే అత్యంత కీలక మ్యాచ్‌లో తలపడనున్నాయి. జైపూర్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ ఫోర్‌కు వెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి. పాయింట్ల పట్టికలో చెరి 12 పాయింట్లతో సమవుజ్జీలుగా ఉన్న ఈ రెండు జట్లు శనివారం నాటి మ్యాచ్‌ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.