క్రీడాభూమి

హఫీజ్‌కు పీసీసీ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారాచి, మే 19: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై తరచు విమర్శలు చేస్తున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హాఫీజ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ విషయంలో ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై లేని పోని విమర్శలు చేస్తున్నందుకు గాను హాఫీజ్‌కు పీసీబీ ఈ-మెయిల్ ద్వారా హఫీజ్‌కు నోటీసు పంపింది. వారం రోజుల్లో తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పీసీబీ కోరింది. బౌలింగ్ వేసేటప్పుడు మోచేతిని 15 డిగ్రీల వరకు వంచేందుకు మాత్రమే ఐసీసీ అనమతిస్తుంది. గతంలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ తీరుపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఐసీసీ అతనిని సస్పెండ్ చేసింది. బౌలింగ్ తీరును మార్చుకున్నానని హఫీజ్ తెలపడంతో ఐసీసీ అవకాశం ఇచ్చింది. ఇంతకు ముందు రెండు పర్యాయాలు బయోమెట్రిక్ పరీక్షకు హాజరై, క్లీన్‌చిట్ పొందినప్పటికీ, తిగిరి అంతకు ముందు మాదిరగానే అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతను మరో రెండు సార్లు సస్పెన్షన్‌కు గురయ్యాడు. తాజాగా ఈనెల 1న తిరిగి హఫీజ్ బౌలింగ్ తీరును పరిశీలించేందుకు ఐసీసీ అనుమతించింది. బయోమెట్రిక్ పరీక్షా ఫలితాలు వెల లడికాకముందే, బౌలింగ్ యాక్షన్ విషయంలో ఐసీసీ అనుసరిస్తున్న విధానాలు తప్పుడుతడకలుగా ఉన్నాయం టూ హఫీజ్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ నియమనిబంధనలకు అనుగుణంగానే బౌలింగ్ వేస్తున్నానని, అయిన్నప్పటికీ తనపై నిషేధాన్ని ఐసీసీ కోనసాగించడం సమాంజసం కాదని హఫీజ్ వ్యాఖ్యానించడాన్ని పీసీబీ తప్పుబట్టింది. వెం టనే సమాధానం ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు పంపింది.