క్రీడాభూమి

నాకౌట్‌కు కోల్‌కతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 18, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ చెరి 16 పాయంట్లతో ప్లే ఆఫ్‌కు చేరాయ. రాజస్తాన్ రాయల్స్ తాజా విజయంతో 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కోసం పోటీపడుతున్నది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ చేరడం ఆదివారం నాటి మ్యాచ్‌ల్లో రాబోయే ఫలితాలపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆ రెండు జట్లూ గెలిస్తే, మొత్తం మూడు జట్లు తలా 14 పాయింట్లతో సమానంగా ఉంటాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్‌ను ఖాయం చేసుకోగా, మిగతా ఒక జట్టును ఎంపిక చేయడానికి నెట్ రన్‌రేట్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ ఆదివారం ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పరాజయాలను చవిచూస్తే, రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరుకుంటుంది. ఆ రెండింటిలో ఏ ఒక్క జట్టు గెలిచినా, ప్లే ఆఫ్‌లో చివరి స్థానాన్ని ఉత్తమ రన్‌రేట్ ప్రాతిపదికగా నిర్ధారిస్తారు.
.*
హైదరాబాద్, మే 19: నాకౌట్ చేరేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అసాధారణ ప్రతిభ కనబరచింది. శనివారం ఇక్కడి రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. 173 పరుగుల లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే, ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది.
టేబుల్ టాపర్ సన్‌రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు శిఖర్ ధావన్, శ్రీవత్స్ గోస్వామీ చక్కటి ఆరంభాన్నిచ్చారు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేసిన గోస్వామీ 26 బంతుల్లోనే, 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఆండ్రె రసెల్‌కు దొరికిపోయాడు. 79 పరుగుల వద్ద సన్‌రైజర్స్ మొదటి వికెట్ కోల్పో యంది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ 17 బంతుల్లోనే, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 36 పరుగులు సాధించి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఓపె నర్ శిఖర్ ధావన్ 39 బంతుల్లో 50 పరుగులు చేసిన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లోనే ఎల్‌బీగా ఔటయ్యాడు. ఆతర్వాత మనీష్ పాండే (25) తప్ప మిగతా బ్యాట్స్‌మన్ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూసుఫ్ పఠాన్ (2), కార్లొస్ బ్రాత్‌వెయట్ 93), షకీబ్ అల్ హసన్ (10), రషీద్ ఖాన్ (0), భువ నేశ్వర్ కుమార్ (0) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరారు. చివరి రెండు బంతుల్లో సన్‌రైజర్స్ రెండు వికెట్లు కోల్పోయంది. మొత్తం మీద 20 ఓవర్లలో 9 వికెట్లు చేజార్చుకొని 172 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బౌల ర్ ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు ఓవర్లలో 30 పరుగులకు 4 వికెట్లు కూల్చాడు.
విజయానికి 173 పరుగుల చేయాలిసన నైట్ రైడర్స్ ఆరంభం నుంచి సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడింది. సునీల్ నారైన్ 29 పరుగులకే ఔటైన ప్పటికీ సన్‌రైజర్స్ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. క్రిస్ లిన్ 43 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 55, రాబిన్ ఉతప్ప 34 బంతు ల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 45 చొప్పున పరుగులు సాధించడంతో స్కోరుబోర్డు లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. ఆండ్రూ రసెల్ (4), నితీష్ రాణా (7) వెనుదిరిగిప్పటికీ, నైట్ రైడర్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కెప్టెన్ దినేష్ కార్తీక్ (26) చివరి ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీయడంతో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన నైట్ రైడర్స్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది.