క్రీడాభూమి

కిడాంబి శ్రీకాంత్‌కు ధోనీ స్పెషల్ గిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ‘లవ్, లక్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ శ్రీకాంత్’ అని బ్యాట్‌పై ధోనీ స్వయంగా రాసిన భ్యాట్‌ను చూసి తెలుగు తేజం ప్రంపచ నెంబర్ 4 బాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. ధోనీకి ఒక ప్రత్యేకమైన అభిమాని శ్రీకాంత్. ఇటీవల గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామనె్వల్త్ క్రీడల్లో శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. మ్యాచ్ అడుతున్న సమయంలో తీవ్ర ఒత్తిడికి గురైన సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ మంచి ఫలితాలు సాధించడం వంటి గుణాన్ని ధోనీ నుంచి నేర్చుకున్నానని చాలా సందర్భాల్లో చెప్పాడు. అతనికి ఎంతో ఇష్టమైన క్రికెటర్ ధోనీ సంతకం చేసిన ప్రత్యేక బ్యాట్‌ను బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీకి వెళ్లి శ్రీకాంత్‌కు అందజేశాడు. బ్యాట్ అందుకున్న శ్రీకాంత్ ధోనీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘చాలా సంతోషంగా ఉంది, ఇది నాకు సర్‌ఫ్రైజ్ గిప్ట్‌‘ అన్నాడు. ఈ బ్యాట్‌ను ఎమ్మెస్కే ఇవ్వడం మరింత అనందంగా ఉందన్నాడు. గుంటూరులో ఉన్నపుడు శ్రీకాంత్ తండ్రి కృష్ట తనను క్రికెట్‌కు పరిచయం చేశారని ఎమ్మెస్కే అన్నాడు.

చిత్రం..ధోనీ బహుమతిగా ఇచ్చిన బ్యాట్‌ను శ్రీకాంత్‌కు అందచేస్తున్న జాతీయ క్రికెట్ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్