క్రీడాభూమి

అంతర్జాతీయ క్రికెటర్లకు ఓటింగ్ అధికారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 21: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సమావేశాల్లో ఓటింగ్ అధికారం ఇకపై అంతర్జాతీయ క్రికెటర్లకు దక్కనుంది. బీసీసీఐ పాలనాధికారుల బృందం (సీఓఏ) సభ్య సంఘాలకు రాసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అన్ని రకాల అనుబంధ సంఘాలకూ ఈ నిబంధన వర్తిస్తుందని సీఓఏ స్పష్టం చేసింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఒకటికి మించిన క్రికెట్ సంఘాలు ఉన్నాయి. రైల్వేస్, సర్వీసెస్ వంటి సంస్థల క్రికెట్ యూనిట్లు కూడా బీసీసీఐలో అనుబంధ సంఘాలుగా ఉన్నాయి. ఇకపై అన్ని రకాల క్రికెట్ సంఘాల్లో భారత్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రాతినిథ్యం వహించిన వారి పేర్లు ఉండాలని సీఓఏ స్పష్టం చేయడం చాలా యూనిట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ తాజా ఆదేశాలపై బీసీసీఐ అనుబంధ సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.
భారత్ ఎదురుదాడి
బ్యాంకాక్, మే 21: థామస్, ఉబర్ కప్ బాడ్మింటన్ టోర్నమెంట్ మొదటి రోజున పరాజయాలను ఎదుర్కొన్న భారత్ రెండో రోజు ఎదురుదాడికి దిగింది. థామస్ కప్ కోసం జరిగే పురుషుల విభాగంలో భారత జట్టు ఆస్ట్రేలియాను 5-0 తేడాతో చిత్తుచేసింది. మహిళల ఉబర్ కప్ పోటీల్లో కూడా ఆస్ట్రేలియాను 4-1 తేడాతో ఓడించింది.