క్రీడాభూమి

సమఉజ్జీల పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 21: ప్రస్తుత సీజన్‌లోని ఐపీఎల్‌లో అతి కీలకమైన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ పోరాడనున్నారు. మంగళవారం జరిగే ఈ మ్యాచ్‌కు ముంబయి వాంఖడే స్టేడియం వేదిక కానుంది. మొత్తం జట్లలో తొలిస్థానంలో ఉన్న హైదరాబాద్, రెండో స్థానంలో ఉన్న చెన్నై ఆడిన 14 మ్యాచ్‌లలో తొమ్మిదింట్లో విజయం సాధించి, మరో ఐదింట్లో పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు సమానంగా 18 పాయింట్లు సాధించాయి. అయితే, రన్ రేటులో మాత్రం కొద్దిపాటి వ్యత్యాసం ఉంది. సన్‌రైజర్స్ +0.284, సూపర్ కింగ్స్ +0.253 రన్ రేటుతో కొనసాగుతున్నాయి. మంగళవారం ఈ రెండు జట్ల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. తొలి క్వాలిఫయర్‌లో ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో మరోసారి తలపడేందుకు ఆస్కారం ఉంటుంది. తొలి క్వాలిఫయర్‌లో గెలిచే జట్టు డైరెక్ట్‌గా ఫైనల్‌కు వెళ్లనున్నందున మంగళవారం నాటి ఇరు జట్లకు అత్యంత కీలకం కానుంది. పుణెలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై తన అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.
మరోపక్క సన్‌రైజర్స్ హైదరాబాద్ గడిచిన వరుస మూడు మ్యాచ్‌లలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో పరాజయాలను చవిచూసింది. హైదరాబాద్ టీమ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై ఈనెల 10న జరిగిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందిన తర్వాత మరే మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. అయితే, సన్‌రైజర్స్ అన్ని జట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్‌కు చేరుకుని అగ్రస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌కు ప్రధాన బలం బౌలింగ్ సామర్థ్యమే. భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మతోపాటు విదేశీ బౌలర్లు రషీద్ ఖాన్, షాకీబ్ అల్ హసన్ వంటివారు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేసేందుకు తగిన ప్రణాళికతో ముందుకు రావాల్సి ఉంటుంది. అయితే, కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ తన అద్భుత ఆటతీరుతో జట్టును ఆదుకుంటున్నాడు. విలియమ్‌సన్ ఇంతవరకు ఆడిన మ్యాచ్‌లలో 661 పరుగులు సాధించాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసినవారిలో రెండో క్రికెటర్‌గా సన్‌రైజర్స్ కెప్టెన్ నిలిచాడు. శిఖర్ ధావన్ ఇంతవరకు 437 పరుగులు చేశాడు. విలియమన్‌సన్, ధావన్ వంటి ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్‌లు మాత్రమే పరుగులు సాధిస్తున్నా మిగిలినవారిలో ముఖ్యంగా మిడిలార్డర్‌లో మనీష్ పాండే వంటి వారు చెన్నైతో జరిగే తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో అత్యంత బాధ్యతాయుతంగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. చెన్నైతో ఈనెల 13న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న అంబటిరాయుడు 79 నాటౌట్‌గా నిలిచిన విషయం గమనార్హం. చెన్నై కూడా రాయుడు లాంటి ఏ కొద్దిమంది బ్యాట్స్‌మెన్‌లను నమ్ముకుని బరిలోకి దిగుతోంది. ఈ టీమ్‌లో రాయుడు ఇంతవరకు 586 పరుగులు, షేన్ వాట్సన్ 438 పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ, సురేష్ రైనా వంటివారు సైతం అడపాదడపా మెరుస్తున్నా ఆశించిన స్కోరు చేయడంలో విఫలమవుతున్నారు. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టులోని దక్షిణాఫ్రికా బౌలర్ ఎన్గిడి పది పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహర్, డ్వేన్ బ్రేవో, హర్బజన్ సింగ్, రవీంద్ర జడేజా వంటివారు మిడిల్ ఓవర్లతో వికెట్లు పడగొడుతున్నారు.