క్రీడాభూమి

మహిళల టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహిళా క్రికెట్‌లో ఐపీఎల్ తరహాలో నిర్వహించిన టీ-20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌కు మంచి స్పందన లభించింది. ఇక్కడి వాంఖడే స్టేడియంలో మంగళవారం ట్రయల్‌బ్లేజర్స్, సూపర్‌నోవాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సూపర్‌నోవాస్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ట్రయల్‌బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేయగా, సూపర్‌నోవాస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ట్రయల్‌బ్లేజర్స్ టీమ్‌కు స్మృతి మంధాన, సూపర్‌నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించారు. తొలుత టాస్ గెలిచిన సూపర్‌నోవాస్ ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన ట్రయల్‌బ్రేజర్స్ టీమ్‌లో వికెట్ కీపర్ అలైస్సా హీలే ఆరు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఏడు పరుగులు చేసి స్కట్ బౌలింగ్‌లో డేనియల్లీ వైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. కెప్టెన్ స్మృతి మంధాన తొమ్మిది బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 14 పరుగులు చేసి ఎలైసా పెర్రీ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చింది.
నాలుగు బంతులు ఎదుర్కొన్న బెత్ మూనే స్కట్ బౌలింగ్‌లో వేదా కృష్ణమూర్తికి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. దీప్తి శర్మ 22 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్లతో 21 పరుగులు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. జమీమా రోడ్రిగ్స్ 23 బంతులు ఎదుర్కొని మూడు బౌండరీలతో 25 పరుగులు చేసి అనుజా పాటిల్ బౌలింగ్‌లో ఎలైసీ పెర్రీకి క్యాచ్ ఇచ్చింది. సుజీ బేట్స్ 37 బంతులు ఎదుర్కొని రెండు బౌండరీలతో 32 పరుగులు చేసి ఎలీసా పెర్రీ చేతిలో బౌల్డ్ అయింది.
శిఖా పాండే 15 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 14, డేనియల్లీ హాజెల్ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఇక సూపర్‌నోసాస్ బౌలర్లలో మెగాన్ స్కట్ నాలుగు ఓవర్లలో 18 పరుగులిచ్చి రెండు, ఎలీసా పెర్రీ మూడు ఓవర్లలో 20 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించారు. అనుజా పాటిల్ నాలుగు ఓవర్లలో 34 పరుగులు, రాజేశ్వరి గైక్వాడ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన నిర్ణీత 130 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సూపర్‌నోవాస్ ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ టీమ్‌లో మిథాలీ రాజ్ 17 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, మూడు బౌండరీలతో 22 పరుగులు చేసి ఏక్తా బిస్త్ బౌలింగ్‌లో తహుహుకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగింది. డేనియల్లీ వైట్ 20 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, రెండు బౌండరీలతో 24 పరుగులు చేసి పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో బెత్ మూనేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది. 14 బంతులు ఎదుర్కొన్న మెగ్ లానింగ్ మూడు ఫోర్లతో 16 పరుగులు చేసింది. పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో జమీమా రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి లానింగ్ వెనుతిరిగింది. సోఫీ డివైన్ 20 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌తో 19 పరుగులు చేసి బేట్స్ చేతిలో బౌల్డ్ అయింది. వేదా కృష్ణమూర్తి రెండు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేసి గోస్వామి చేతిలో బౌల్డ్ అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 23 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 21 పరుగులు చేసి బేట్స్ బౌలింగ్‌లో తహుహుకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టింది.
మోనా మెస్రమ్ ఏడు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి స్మృతి మంధాన చేతిలో రనౌట్ అయింది. ఎలీసా పెర్రీ 14 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో 13, పూజా వస్త్రాకర్ మూడు బంతులు ఎదుర్కొని రెండు పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ట్రయల్‌బ్లేజర్స్ బౌలర్లలో పూనమ్ యాదవ్ నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు, సుజీ బేట్స్ మూడు ఓవర్లలో 16 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించారు. జులన్ గోస్వామి నాలుగు ఓవర్లలో 22, ఏక్తా బిస్త్ నాలుగు ఓవర్లలో 24 పరుగులిచ్చి చెరో వికెట్ తీసుకున్నారు.
సంక్షిప్త స్కోరు:
ట్రయల్‌బ్లేజర్స్: 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 129 (సుజీ బేట్స్ బి పెర్రీ 32, జమీమా రోడ్రిగ్స్ సి పెర్రీ బి అనుజా పాటిల్ 25, దీప్తి శర్మ సి హర్మన్‌ప్రీత్ కౌర్ బి రాజేశ్వరి గైక్వాడ్ 21, మెగాన్ స్కట్ 2/18, ఎలీసా పెర్రీ 2/20).
సూపర్‌నోవాస్: 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 130 (డేనియల్లీ వైట్ సి బెత్ మూనే బి పూనమ్ యాదవ్ 24, మిథాలీ రాజ్ సి తహుహు బి ఏక్తా బిస్త్ 22, హర్మన్‌ప్రీత్ కౌర్ సి తహుహు బి బేట్స్ 21, పూనమ్ యాదవ్ 2/21, సుజీ బేట్స్ 2/16).