క్రీడాభూమి

ఆ మార్పులు స్లో ఓవర్ రేటుకు హేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో స్లో ఓవర్ రేటు జట్లకు ఓ ప్రధాన సమస్యగా పరిణమించిందని చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. ముఖ్యంగా వాతావరణంలో వేడి, తేమ వంటి అంశాలు స్లో ఓవర్ రేటుకు కారణమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. ముంబయి, చెన్నైలలో మ్యాచ్‌లలో క్రికెటర్లు చాలా ఎక్కువ సమయం ఆడుతున్నారని, ఈ పరిస్థితుల్లో వేడి, తేమ వంటి అంశాలు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, దీంతో వారు కొంత ఒత్తిడి గురవుతున్నారని ఆయన అన్నాడు. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా కొందరు కెప్టెన్లకు అపరాధ రుసుం (ఫైన్) పడిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నాడు. స్లో ఓవర్ రేటు కారణంగా సమయం మొత్తం వృథా అవుతుందని ఆయన అభిప్రాయపడ్డాడు. తమ జట్టు ఈ సీజన్‌లో ఒకే ఒకసారి స్లో ఓవర్ రేటును ఎదుర్కొందని (సన్‌రైజర్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో), అయినా తాము అద్భుతంగా ఆడామని ఆయన అన్నాడు. ఈనెల 27న జరిగే ఫైనల్‌లో ఇలాంటి పొరపాట్లు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నాడు. ఇదిలావుండగా, తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తమ జట్టు గెలుపొందడం, ఇందులో కీలక పాత్ర పోషించిన ఫఫ్ డుప్లెసిస్ (42 బంతులకు 67 పరుగులు) ఆటతీరు అద్భుతమని ఆయన అన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ ఫెరారీ కారు మాదిరిగా దూసుకుపోయి, తమ జట్టును ఫైనల్‌కు చేర్చాడని ఆయన ప్రస్తుతించాడు.
గాయపడిన బిల్లింగ్స్...డుప్లెసిస్‌కు చాన్స్
ముంబయి వాంఖడే స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చడంలో ఫఫ్ డుప్లెసిస్ ఎంతో సమర్థవంతమైన, కీలకమైన పాత్రను పోషించాడని చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నాడు. వాస్తవానికి తమ టీమ్ క్రికెటర్ శాం బిలింగ్స్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడలేకపోవడంతో ఆ అవకాశం డుప్లెసిస్‌కు దక్కిందని ఆయన పేర్కొన్నాడు. ఇంతవరకు జరిగిన 11 ఐపీఎల్ సీజన్‌లలో ఇప్పటికే రెండుసార్లు చాంపియన్లుగా అవతరించి, రెండేళ్లపాటు నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ పోటీలో డుప్లెసిస్ అత్యధికంగా 67 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కృతకృత్యుడయ్యాడని ఫ్లెమింగ్ అన్నాడు. తమ జట్టులోని క్రికెటర్ శాం బిల్లింగ్ గాయం కారణంగా బాధపడుతున్న నేపథ్యంలో ఈనెల 27న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడే ఆస్కారం ఉండకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డాడు. అతని స్థానంలో డుప్లెసిస్‌కు అవకాశం కల్పించామని, ఈ సీజన్‌లో అతను ఐదోసారి బరిలోకి దిగాడని, గత మ్యాచ్‌లో అతను దీనిని సద్వినియోగం చేసుకున్నాడని, ఆయన ప్రస్తుతించాడు.