క్రీడాభూమి

బౌలింగ్ భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 23: ముంబయి వాంఖడే స్టేడియంలో మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ సీజన్‌లోని తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తమ జట్టు బౌలర్ల బౌలింగ్ తీరును సన్‌రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అభినందించాడు. ముఖ్యంగా డెత్ బౌలింగ్‌లో కార్లోస్ బ్రాత్‌వైట్‌ను బౌలింగ్‌లోకి దించాలని తాము ముందే ఊహించామని, నరాలు తెగిపోయే ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో డెత్ ఓవర్లు జట్టును కాపాడతాయని ఆయన మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అన్నాడు. ఈ విషయంలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన బ్రాత్‌వైట్ ఆటతీరును ఆయన ప్రస్తుతించాడు. బ్రాత్‌వైట్ ఈ సీజన్‌లో ఆడడం ఇది రెండోసారి. డెత్ బౌలింగ్ తమ ప్రధాన బలమని ఆయన వ్యాఖ్యానించాడు. ఈ సీజన్‌లో తాము ఆడిన కొన్ని మ్యాచ్‌లలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా విజయం సాధించామని ఆయన పేర్కొన్నాడు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ సహా తమ జట్టులోని మిగిలిన బౌలర్లు సైతం ఎంతో అద్భుత ప్రదర్శనను కనబరిచారని ఆయన పేర్కొన్నాడు. తాము ఈనెల 25న రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో జరిగిన కొన్ని పొరపాట్లు దొర్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 140 పరుగులతో ఘన విజయం సాధించింది. చెన్నై ఏడు వికెట్లు కోల్పోయి కేవలం 92 పరుగులు చేసిన నేపథ్యంలో ఆ జట్టు క్రికెటర్ పఫ్ డుప్లెసిస్ 42 బంతులను ఎదుర్కొని 67 పరుగులు చేసి చెన్నైను ఫైనల్‌కు చేర్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించడంలో డుప్లెసిస్ బ్యాటింగ్ సరళి అద్భుతమని హైదరాబాద్ కెప్టెన్ విలియమ్‌సన్ వ్యాఖ్యానించాడు. కాగా, బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈనెల 25న జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ ఈనెల 27న జరిగే ఫైనల్‌లో ఆడుతుంది.