క్రీడాభూమి

వరల్డ్ ఫుట్‌బాల్ కప్‌కు అర్జెంటీనా గోల్‌కీపర్ రోమేరో దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యూనోస్ ఎయిర్స్, మే 23: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న ప్రధాన టీమ్‌లకు మేటి ఆటగాళ్లు ఎదుర్కొంటున్న పలు గాయాల సమస్యలు వారిని టోర్నమెంట్‌లో పాల్గొనకుండా చేస్తున్నాయి. ఫుట్‌బాల్ క్రీడా దిగ్గజాలైన అర్జెంటీనా వంటి దేశాలకు చెందిన క్రీడాకారులు సైతం మోకాలు, చీలమండ, వెన్ను నొప్పి వంటి అనేక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రష్యాలో జరుగనున్న 2018 వరల్డ్ ఫుట్‌బాల్ కప్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఎఫ్‌ఏ) 23 సభ్యులు కలిగిన జట్టును ప్రకటించింది. బ్యూనోస్ ఎయిర్స్‌లో ఎఎఫ్‌ఎ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిక్షణ శిబిరంలో మాంచెస్టర్ యునైటెడ్ గోల్‌కీపర్ రోమేరో మోకాలికి గాయం కావడంతో ఆయనకు జట్టులో స్థానం కల్పించకుండా విశ్రాంతి కల్పించినట్టు ఫుట్‌బాల్ సంఘం పేర్కొంది. అర్జెంటీనా జట్టులో పేరు గాంచిన క్రీడాకారుల్లో ఒకడైన 31 ఎళ్ల రోమోరో 2010, 2014 వరల్డ్ కప్‌తో పాటు జాతీయ స్థాయిలో జరిగిన దాదాపు 83 మ్యాచ్‌ల్లో పాల్గొని సత్తాచాటాడు. అయితే అర్జెంటీనా జట్టులో రోమెరో లేకపోడం జట్టుకు నష్టనేనని ఏఎఫ్‌ఎ పేర్కొంది.