క్రీడాభూమి

అలసిపోయా..అందుకే రిటైర్మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రెటోరియా, మే 23: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (34) అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఈ అనూహ్య నిర్ణయంపై ఆయన ఒక వీడియో సందేశంలో ట్విటర్ ద్వారా వెల్లడించాడు. ప్రెటోరియాలోని టక్స్ క్రికెట్ క్లబ్‌లో 14 ఏళ్ల క్రితం యువ క్రికెటర్‌గా చోటుదక్కించుకున్న తాను ఇప్పటికీ కొనసాగుతున్నానని ఆయన పేర్కొన్నాడు. ప్రొటీస్ స్క్వాడ్ పిలుపు మేరకు తాను అందులో చేరానని ఆయన తెలిపాడు. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు, 78 టీ-20 మ్యాచ్‌లలో ఆడి, బాగా అలసిపోయానని ఆయన పేర్కొన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడం వల్ల ఎంతోమంది యువ ఆటగాళ్లకు చోటు దక్కుతుందని, తన నిర్ణయం చాలా కఠినమైనదని తెలిసినా నిజాయితీగా తప్పుకునేందుకు ఒక మంచిరోజు వచ్చిందని తాను భావిస్తున్నానని ఆయన అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌లతో జరిగిన గొప్పవైన టెస్టు సిరీస్ మ్యాచ్‌లలో విజయం సాధించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడానికి ఇదే మంచి తరుణమని భావించి ఈ నిర్ణయం తీసుకుని వెంటనే ప్రకటించినట్టు ఆయన తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని తాను తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన మరోమారు స్పష్టం చేశాడు. తన క్రికెట్ క్రీడా జీవితంలో ఇంతవరకు తనతో ఆడిన సహచరులు, కోచ్‌లు, సిబ్బంది, తన వెన్నంటి ఉండి మద్దతు పలికిన అందరికీ పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా తనను అభిమానించే దక్షిణాఫ్రికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. భవిష్యత్తులో విదేశాల్లో జరిగే క్రికెట్‌లో ఆడే ఆలోచనేదీ లేదని ఆయన స్పష్టం చేశాడు. (ఈ నిర్ణయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడే ఆస్కారం లేనట్టే). బహుశా దేశవాళీ క్రికెట్‌లో టైటాన్స్ తరఫున ఆడే అవకాశం ఉండొచ్చునని ఆయన పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్‌తోపాటు ప్రొటీస్ క్లబ్‌కు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చాడు ఈ దిగ్గజ బ్యాట్స్‌మన్ డివిలియర్స్. ఈ కుడిచేతివాటం బ్యాట్స్‌మన్ ఇంతవరకు ఆడిన 114 టెస్టు మ్యాచ్‌లలో 9,577 పరుగులు, 228 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో 9,577 పరుగులు, 78 టీ-20 మ్యాచ్‌లలో 1,672 పరుగులు చేశాడు. డుప్లెసిస్ టెస్టు కెరీర్‌లో 50.66 సరాసరిన 22 సెంచరీలు, 46 అర్ధసెంచరీలు ఉన్నాయి. వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా క్రికెటర్లలో జాక్వెలిస్ కలిస్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఘనత డివిలియర్స్‌దే. జాక్వెలిస్ క్రికెట్ క్రీడా జీవితంలో 44.36 సరాసరిన 11,579 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 87 అర్ధ సెంచరీలు ఉన్నాయి. డివిలియర్స్ మూడు ఫార్మాట్‌లలో ఆడిన 420 మ్యాచ్‌లలో 20వేలకు పైగా పరుగులు చేశాడు. వీటిలో 47 సెంచరీలు ఉన్నాయి.
ఇదిలావుండగా, తమ దేశ క్రికెట్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినట్టు తీసుకున్న తాజా నిర్ణయంపై దక్షిణాఫ్రికా క్రికెట్ ప్రెసిడెంట్ క్రిస్ నెంజానీ మాట్లాడుతూ తన ఆటతీరుతో ఇంటా బయట వేలాది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ఎంతోమంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడని ప్రస్తుతించాడు. డివిలియర్స్ తమ జట్టులో లేని లోటును ఎవరూ పూరించలేనిదని, అతను లేకుండా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లను ఊహించలేమని ఆయన వ్యాఖ్యానించాడు.