క్రీడాభూమి

బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 24: బ్యాటింగ్ వైఫల్యంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థా రాయల్స్ ఓటమిపాలైందని ఆ జట్టు కెప్టెన్ అజింక్య రహానే స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ప్రధాన ఘట్టమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో తమ జట్టు ఓటమిపాలవడం చాలా బాధేసిందన్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ తమ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ముందుంచగా, లక్ష్యం సాధించేందుకు పెద్ద స్కోరు కాకపోయినా దానిని ఛేదించడంలో విఫలమవడానికి కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమేనని చెప్పాడు. మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ మ్యాచ్ ప్రారంభం నుండి తమ జట్టు అటగాళ్లు కలిసికట్టుగా ఆడి ఫీల్డింగ్, బౌలింగ్ ఆశించిన విధంగా బాగుండడంతో కోల్‌కతా మేటి బ్యాట్స్‌మెన్లను ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టు సాధించామన్నాడు. అయితే, కోల్‌కతా బ్యాటింగ్‌లో రాణించిన కార్తీక్, శుభ్‌మాన్ గిల్ కలిసికట్టుగా ఆడి చక్కటి భాగస్వామ్యాన్ని సాధించి కష్టాల్లో ఉన్న కోల్‌కతాను అదుకున్నారన్నాడు. ఇదిలా ఉండగా మ్యాచ్‌లో ఆండ్రూ రస్సెల్ ఇచ్చిన క్యాచ్‌ను వదిలేయడంతో తమ జట్టుపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. కోల్‌కతా మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా ఆటతీరును ప్రదర్శించిందని, తమ ముందు సాధారణ విజయ లక్ష్యం ఉన్నా, దానిని చేరుకోలేక పోవడం చాలా బాధాకరంగా ఉందన్నాడు. తనతోపాటు సంజూ శాంసన్ ఆడుతున్నపుడు మ్యాచ్ తమకు అనుకూలంగానే ఉందని భావించామని, ఈ క్రమంలో సంజు శాంసన్ (50), తాను చేసిన (46) పరుగులతో కలిసి చక్కగా ఆడి మిడిల్ వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించినట్లు తెలిపాడు. అయితే, తామిద్దరం స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పట్టడంతో మ్యాచ్‌ను జారవిడుచుకోవాల్సి వచ్చిందన్నాడు. ఈ సీజన్‌లో తమ జట్టు బౌలర్‌లు అద్భుతంగా రాణించారని, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరగులు చేయగా, అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 25 పరుగులతో విజయం సాధించి క్వాలిఫయర్ మ్యాచ్‌కు అర్హత పొందింది.