క్రీడాభూమి

భయం వదిలితేనే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 24: త్వరలో జరుగనున్న ఆసియా గేమ్స్‌లో పోరాడేందుకు ఎలాంటి భయం, బెరుకు లేకుండా పోరాడేందుకు ముందుకు రావాలని 2016 రియో ఒలింపిక్స్ విజేత, ప్రముఖ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు కోచ్ బిశే్వశ్వర్ నంది హితవు పలికాడు. రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన 24 ఏళ్ల దీపా ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతోంది. గత ఏడాది ఏప్రిల్‌లో ఆమె కాలికి శస్తచ్రికిత్స జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్యపరంగా దాదాపు 90 శాతం ఫిట్‌గా ఉందని ఆయన తెలిపాడు. ఆసియా గేమ్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆమె పోటీలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించాడు. కామనె్వల్త్ గేమ్స్‌తో పోల్చుకుంటే ఆసియా గేమ్స్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, చైనా, జపాన్, కొరియా వంటి దేశాల నుంచి ఎంతోమంది అగ్రశ్రేణి అథ్లెట్లు పాల్గొంటారని ఆయన తెలిపాడు. వారితో పోటీ పడి పతకం సాధించడమంటే చాలా కష్టసాధ్యమని, కానీ గాయంతో బాధపడుతున్నాననే భయాన్ని మనసు నుండి పారద్రోలాలని, అప్పుడే విజయం సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.