క్రీడాభూమి

ఇంగ్లాండ్ వెన్ను విరిచిన అబ్బాస్, అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్, మే 24: ఇంగ్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్ మైదానంలో గురువారం ప్రారంభమైన ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో భాగంగా తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య జట్టు 58.2 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. పాక్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్, హసన్ అలీ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ల వెన్ను విరిచారు. ఇరు జట్ల మధ్య ఈ టెస్టు మ్యాచ్ ఈనెల 24 నుంచి 28 వరకు జరుగుతుంది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఓపెనర్‌గా దిగిన మార్క్ స్టోన్‌మ్యాన్ 12 బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో నాలుగు పరుగులు చేసి మహ్మద్ అబ్బాస్ చేతిలో బౌల్డ్ అయి నిరాశపరిచాడు. కెప్టెన్ జో రూట్ 24 బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేసి హసన్ అలీ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. డేవిడ్ మలాన్ మూడు బంతులు ఎదుర్కొని ఒక బౌండరీతో ఆరు పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో సర్ఫరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. వికెట్ కీపర్ జోనీ బెయిర్‌స్టో 59 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లతో 27 పరుగులు చేసి ఫహీమ్ అష్రాఫ్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. రెండో ఓపెనర్ అలస్టెయిర్ కుక్ 148 బంతులు ఎదుర్కొని 14 బౌండరీలతో 70 పరుగులు చేసి, అమీర్ చేతిలో బౌల్డ్ అయ్యాడు. బెన్ స్టోక్స్ 64 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్, ఐదు బౌండరీల సహాయంతో 38 పరుగులు చేసి మహ్మద్ అబ్బాస్ చేతిలో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. జోస్ బట్లర్ 15 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో 14 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో షాకీబ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. డొమినిక్ బెస్ 14 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఐదు పరుగులు చేసి మహ్మద్ అబ్బాస్ బౌలింగ్‌లో షాకీబ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ దారిపట్టాడు. స్టువర్ట్ బ్రాడ్ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే మహ్మద్ అబ్బాస్ చేతిలో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. మార్క్ ఉడ్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో ఏడు పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్‌లో అమీర్‌కు దొరికిపోయాడు. జేమ్స్ ఆండెర్సన్ ఒక బంతిని ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్తాన్ బౌలర్లలో మహ్మద్ అబ్బాస్ 14 ఓవర్లలో 23 పరుగులు, హసన్ అలీ 15.2 ఓవర్లలో 51 పరుగులిచ్చి చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు. మహ్మద్ అమీర్ 14 ఓవర్లలో 41, ఫహీమ్ అష్రాఫ్ తొమ్మిది ఓవర్లలో 28 పరుగులిచ్చి తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ప్రత్యర్థి తమ ముందు ఉంచిన నిర్ణీత 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాక్ తొలిరోజు తొలి ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది.

చిత్రం..ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో అత్యధిక పరుగులు (78) చేసిన అలస్టెయర్ కుక్