క్రీడాభూమి

ఒకేసారి ఇద్దరితో పెళ్లా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బార్సిలోనా, మే 25: ఒకేసారి ఇద్దరు మహిళలను పెళ్లాడనున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అదో పెద్ద అబద్ధమని బ్రెజిల్ మాజీ సూపర్ స్టార్, బార్సిలోనా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ రొనాల్డినో స్పష్టం చేశాడు. తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్‌లైన ప్రిసిల్లా కోల్హో, బియాట్రిజ్ సౌజాలను తాను ఒకేసారి పెళ్లాడుతున్నట్టు లోకమంతా కోడై కూస్తోందన్న విషయమై ఆయన స్పందిస్తూ ఇక్కడ ఒక మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఎలాంటి పెళ్లిళ్లు చేసుకోలేదు..ఆ ఆలోచనే లేదు..ఆ ప్రచారమంతా పెద్ద అబద్ధం’ అని అన్నాడు. వాస్తవానికి ఇద్దరు మహిళలను రియోలో సీక్రెట్‌గా ఫుట్‌బాల్ సూపర్ స్టార్ పెళ్లాడబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. తన ఇద్దరు గర్ల్ ఫ్రెండ్‌లను గత ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్టు రొనాల్డినో గతంలో ప్రతిపాదన చేశాడు. ఇందుకు అనుగుణంగా ఆ ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ రింగ్‌లను కూడా ఇచ్చాడని స్థానికంగా గల ఒక వార్తా పత్రిక గతంలో కథనంలో వెల్లడించింది. అంతేకాకుండా రొనాల్డినో తన గర్ల్ ఫ్రెండ్‌లిద్దరికీ పాకెట్ మనీ కింద 1,500 పౌండ్లు అలవెన్సులు కూడా ఇచ్చినట్టు ఆ పత్రిక తెలిపింది. ఆ ఇద్దరు యువతులను త్వరలో పెళ్లాడబోతున్నట్టు వచ్చిన వార్తలతో ప్రపంచమంతా తనవైపే దృష్టి సారించి ప్రశ్నించడంతో వాస్తవాలేమిటో మీడియా ద్వారా తెలియజెపుతున్నానని ఆయన పేర్కొన్నాడు. కాగా, బ్రెజిల్ మాజీ ఆటగాడు, ప్రస్తుతం బార్సిలోనా సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న రొనాల్డినో బ్రెజిల్ తరఫున ప్రాతినిధ్యం వహించిన సమయంలో 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్ చేశాడు. తన దేశం తరఫున ఇంతవరకు రెండు ఫిఫా వరల్డ్ కప్‌లలో అతను ప్రాతినిధ్యం వహించాడు. 2002లో బ్రెజిల్ వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2003లో బార్సిలోనా దేశం తరఫున ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత 2008 వరకు 145 మ్యాచ్‌లలో 70 గోల్స్ చేశాడు.