క్రీడాభూమి

కోహ్లీ యంత్రం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యంత్రం కాదని, అతనిని కూడా ఒక మనిషిగా గుర్తించాలని కోచ్ రవి శాస్ర్తీ అన్నాడు. ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఈనెల 17న జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మెడకు గాయమైన విషయం తెలిసిందే. ఈ గాయం నుండి కోలుకోవడానికి విరాట్‌కు కాస్త విశ్రాంతి అవసరమని, అతను యంత్రం కాదని గురిస్తే చాలని ఆయన వ్యాఖ్యానించాడు. విరాట్ కోహ్లీ జూన్ నెలాఖరులో ఇంగ్లాండ్ కౌంటీ టీమ్ తరఫున సర్రే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ గాయం కారణంగా దాదాపు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత శారీరకంగా ఫిట్ అనిపిస్తేనే ఇంగ్లాండ్ కౌంటీలో ఆడతాడని బీసీసీఐ స్పష్టం చేసింది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? అన్న మీమాంశ ఎంతోమంది అభిమానుల్లో నెలకొనడంతోపాటు నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ రవి శాస్ర్తీ మీడియాతో మాట్లాడుతూ ‘కోహ్లీ మెషీన్ కాదు..ఒక మనిషి’ అంటూ ‘్ఫ్యయల్ నింపిన వెంటనే మైదానం నుండి పుంజుకోవడానికి అతనేమీ రాకెట్ కాదు’ అని వ్యాఖ్యానించాడు.
జూన్ 15న ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్‌లలో కోహ్లీ ఆడే అవకాశం ఉంది. అదేవిధంగా జూన్ 14 నుంచి బెంగళూరులో అఫ్గనిస్తాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్‌లో కూడా కోహ్లీ ఆడే అవకాశం లేదు.