క్రీడాభూమి

మాంటే కార్లో మాస్టర్స్ టైటిల్ కోసం నాదల్-మోన్‌ఫిల్స్ అమీతుమీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంటే కార్లో, ఏప్రిల్ 16: మాంటే-కార్లో మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్, ఫ్రాన్స్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ టోర్నీలో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్ శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో బ్రిటన్‌కు చెందిన రెండో సీడ్ ఆటగాడు ఆండీ ముర్రేకి చెక్ పెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ముర్రే నుంచి గట్టి పోటీ ఎదురవడంతో తొలి సెట్‌ను 6-2 తేడాతో కోల్పోయిన నాదల్ ఆ తర్వాత తనదైన శైలిలో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించాడు. ఫలితంగా అతను 4-6, 2-6 తేడాతో వరుసగా రెండు సెట్లలో ముర్రేని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. కాగా, మరో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 13వ సీడ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్ 6-1, 6-3 తేడాతో ఫ్రాన్స్‌కే చెందిన 8వ సీడ్ ఆటగాడు జో-విల్‌ఫ్రెడ్ సోంగాపై విజయం సాధించి నాదల్‌తో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు.