బిజినెస్

డాటా పరిరక్షణకు కఠిన చట్టాలు తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూ ఢిల్లీ, మే 25: వ్యక్తుల గోప్యతను కాపాడేందుకు తక్షణమే డాటా రక్షణ చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ గవర్నెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిన్మయ్ అరుణ్ అన్నారు. శుక్రవారం ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ, సమాజంపై ప్రభావంపై అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ దేశంలో పెద్ద ఎత్తున డిజిటల్ రంగంలో మార్పులు వస్తున్నాయని, డిజిటట్ పరిపాలన వేగవంతమైందని, ఈ నేపథ్యంలో వ్యక్తుల డాటా పరిరక్షణకు కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందన్నారు. దీని నిమిత్తం ఒక రెగ్యులేటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వివరాల సేకరణ, ప్రోసెసింగ్ ప్రక్రియ పెరిగిందన్నారు. వ్యక్తుల గోప్యతకు సంబంధించి వివరాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. డిజిటల్ రంగ నిపుణులు అనం త్ పద్మనాభన్ మాట్లాడుతూ విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, మొబిలిటీ రంగం లో కీలకమైన సమాచారం అపహరణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై ప్రజల్లో ఆందోళన ఉందన్నారు. సుప్రీం కోర్టు న్యాయవాది బృంద భండారి మాట్లాడుతూ, డాటా పరిరక్షణకు చట్టం తేవడంపై ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలన్నారు. రెగ్యులేటరీకి టెక్నాలజీ సదుపాయాలు కల్పించాలన్నారు. వినియోగదారుల్లో కూడా చైతన్యం పెరగాలన్నారు. డాటా పట్ల ఎవరికి అనుసంధానం ఉంటుందనే విషయమై వినియోగదారులకు అవగాహన ఉండాలన్నారు. డాటా తస్కరణ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వినియోగదారులపై ఉందని, అలాగే కఠినమైన చట్టాలు తేవాలన్నారు. డాటా పరిరక్షణ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ మాట్లాడుతూ డిజిటల్ ఆర్థిక రంగం, డిజిటల్ పాలన, డిజిటల్ నాలెడ్జ్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. యుఐడిఎఐ చైర్మన జె సత్యనారాయణ మాట్లాడుతూ, టెక్నాలజీ వల్ల విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయని, ఆధార్ డాటాకు సంపూర్ణ పరిరక్షణ ఉందని చెప్పారు.