క్రీడాభూమి

భేష్ రషీద్ భాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 26: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ జట్టులో సభ్యులతోపాటు కోల్‌కతాతో శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించి, జట్టును విజయవంతంగా ఫైనల్‌కు చేర్చిన అఫ్గనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 14 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకోవడంలో ప్రధాన భూమిక వహించిన రషీద్ ఖాన్ ఘనత చెప్పనలవి కాదని ఆయన పేర్కొన్నాడు. కోల్‌కతాతో జరిగిన ఈ మ్యాచ్‌లో రషీద్ 10 బంతుల్లో 34 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 19 పరుగులిచ్చి మూడు ప్రధాన వికెట్లను పడగొట్టడంతోపాటు రెండు క్యాచ్‌లు అద్భుతంగా పట్టడం, ఒక రనౌట్ చేయడంతో ఉత్కంఠభరిత పోరులో హైదరాబాద్‌ను గెలిపించాడని కెప్టెన్ పొగిడాడు. ఈ పోరాటం చాలా గొప్పదని, ఈ ఘనత అంతా తమ జట్టులోని కుర్రాళ్లకే దక్కుతుందని ఆయన పేర్కొన్నాడు. ఫైనల్‌లో చోటు దక్కాలంటే అన్నివిధాల అద్భుత ప్రదర్శన ఒక్కటే మార్గమని భావిస్తూ చివరివరకూ పోరాడామని, అందుకు తగిన ఫలితం వచ్చిందని ఆయన అన్నాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తమకు రషీద్ ఖాన్ వంటి బౌలర్ దక్కడం తమ అదృష్టమని, ఎంతో పోరాట పటిమ కలిగిన ఇలాంటి గొప్ప ఆటతీరును ప్రదర్శించే క్రికెటర్లను ఎప్పటికీ వదులుకోమని విలియమ్‌సన్ వ్యాఖ్యానించాడు. జట్టులోని కొందరు ప్రధాన ఆటగాళ్లు గాయాలబారిన పడినా జట్టు కూర్పులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించామని ఆయన అన్నాడు. సాహా, గోస్వామి వంటి క్రికెటర్లు సైతం ఇంతవరకు జరిగిన మ్యాచ్‌లలో తాము ఆశించిన రీతిలో ఆటతీరును కనబరిచారని, ఫైనల్లో ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లోనూ రాణించి చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశాడు. రషీద్ ఖాన్ మాట్లాడుతూ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్, ఫీల్డింగ్‌లలో వందశాతం ప్రదర్శనను కనబరిచాననే విశ్వసిస్తున్నానని అన్నాడు. బ్యాట్స్‌మన్‌గా క్రీడా జీవితాన్ని ప్రారంభించిన తాను ఆ తర్వాత కాలంలో స్పిన్నర్‌గా మారినా రెండు విభాగాల్లోనూ రాణించాలనే తపన ఎంతో ఉందని ఆయన పేర్కొన్నాడు.