క్రీడాభూమి

గాలే పిచ్.. మ్యాచ్ ఫిక్సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: గత ఏడాది ఇండియా శ్రీలంక టెస్ట్ మ్యాచ్ ముందుగా మ్యాచ్ ఫిక్సర్స్ గ్రౌండ్స్‌మాన్‌తో కుమ్మక్కై పిచ్‌ను మార్చారని స్టింగ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ఈ విషయమై ఐసిసి శాఖాపరమైన దర్యాప్తును శనివారం చేపట్టింది.
ముంబయికి చెంది ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ రాబిన్ మారిస్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆ ఆపరేషన్‌లో తేలింది. మైదానంలో పిచ్ గ్రౌండ్స్‌మ్యాన్‌కు ముడుపులు చెల్లించి పిచ్‌ను మార్చినట్లు రాబిన్ అంగీకరించినట్లు అభియోగం. ఈ స్టింగ్ ఆపరేషన్‌ను టీవీల్లో ప్రసారం చేయనున్నారు. కాగా, ఖతార్‌కు చెందిన కొన్ని చానల్స్ కొన్ని దృశ్యాలను ఆన్‌లైన్‌లో ప్రసారం చేశాయి.
శ్రీలంకలోని గల్లే స్టేడియంలో పిచ్‌ను మార్చే విషయమై మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడం క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు కలిగించాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టామని, ఆయా దేశాల క్రికెట్ సంస్థల సహాయాన్ని తీసుకుంటామని, అనేక ఫిర్యాదులు అందుకుంటున్నామని ఐసిసి అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు. అవినీతికి సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నామని, వీటికి సంబంధించి సమాచారం ఉన్న వారు తమకు ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఐసిసికి సహకరిస్తామని శ్రీలంక క్రికెట్ ఇప్పటికే తెలిపిందని చెప్పారు. క్రీడల్లో అవినీతిని సహించే ప్రసక్తిలేదని శ్రీలంక క్రికెట్ సిఇవో ఆష్లే డి సిల్వ చెప్పారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సిఇవో డేవిడ్ రిచర్డ్‌సన్‌ను కూడా సంప్రదించామని ఆయన చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జూలై 26 నుంచి 29వ తేదీ వరకు శ్రీలంకలోని గల్టే స్టేడియంలో జరిగిన క్రికెట్ టెస్ట్ మ్యాచ్ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్‌ను బౌలర్లు, బ్యాట్స్‌మెన్, స్పిన్నర్లకు తగినట్లుగా మారుస్తామని గ్రౌండ్స్‌మ్యాన్ తరంగ ఇండికా పేర్కొన్నట్లు వెబ్‌సైట్‌లో దృశ్యాలను ప్రసారం చేసిన చానల్ పేర్కొంది. ఈ మ్యాచ్‌లో భారత్‌లో 304 పరుగుల ఆధిక్యతతో నెగ్గిన విషయంవిదితమే.