క్రీడాభూమి

చెన్నై మూడోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐపీఎల్‌ను మూడోసారి చెన్నై సూపర్ కింగ్స్ తన్నుకుపోయంది. ముంబయి వాంఖడే స్టేడియంలో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ను ధోనీ సేన ఎనిమిది వికెట్ల తేడాతో తన ఖాతాలో వేసుకుంది. హోరాహోరీ అంచనాలకు భిన్నంగా తుది పోరు ఏకపక్షంగా ముగిసింది. షేన్ వాట్సన్ విజృంభణ చెన్నై విజయాన్ని సులభతరం చేసింది. 2010లో తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై, మరుసటి ఏడాదీ టైటిల్‌ను ఎగరేసుకుపోయంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు నేపథ్యంలో రెండేళ్లు సస్పెన్షన్‌కు గురై, ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన చెన్నై వీరులు ట్రోఫీని అందుకొని సత్తా చాటారు. సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 178 పరుగులు చేస్తే, చెన్నై తన లక్ష్యాన్ని మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. మొత్తం మీద పది పర్యాయాలు ఐపీఎల్ ఆడిన చెన్నై మూడుసార్లు టైటిల్ సాధించింది. ఈ ఏడాది టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను చిత్తుచేసి టైటిల్ వేటను ప్రారంభించిన చెన్నై, ఫైనల్‌లో మాజీ చాంపియన్ సన్‌రైజర్స్‌పై పూర్తి ఆధిపత్యంతో విజయాన్ని నమోదు చేసింది. చెన్నైకి 20 కోట్లు, సన్‌రైజర్స్‌కు 12.5 కోట్లు రూపాయల ప్రైజ్ మనీ దక్కింది.

చిత్రం..చెన్నై సూపర్ కింగ్ జట్టు విజయానందం