క్రీడాభూమి

రికార్డు భాగస్వామ్యంతో వోగ్స్, మార్ష్ విజృంభణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, డిసెంబర్ 11: వెస్టిండీస్‌తో మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్లు ఆడమ్ వోగ్స్ (269-నాటౌట్), షాన్ మార్ష్ (182) సెంచరీలతో విజృంభించి నాలుగో వికెట్‌కు 449 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 583 పరుగుల భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత కరీబియన్లను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి భారీ విజయం దిశగా ముందుకు సాగుతోంది. మూడు వికెట్ల నష్టానికి 438 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వోగ్స్, మార్ష్ విండీస్ బౌలర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్రీజ్‌లో పాతుకుపోయి చూడముచ్చటైన షాట్లతో అలరించిన వీరు స్కోరు బోర్డును పరుగులు తీయించారు. దూకుడుగా ఆడిన వోగ్స్ 226 బంతుల్లో డబుల్ సెంచరీ నమోదు చేసుకోగా, 227 బంతుల్లో 150 పరుగులు పూర్తిచేసిన మార్ష్ 182 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వర్రికాన్ బౌలింగ్‌లో బ్రావోకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 570 పరుగుల స్కోరు వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా మరో 13 పరుగులు సాధించి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అప్పటికి వోగ్స్ 285 బంతుల్లో 33 ఫోర్ల సహాయంతో 269 పరుగులతోనూ, మిఛెల్ మార్ష్ 1 పరుగుతోనూ అజేయంగా నిలిచారు. విండీస్ బౌలర్లలో వర్రికాన్ మూడు వికెట్లు సాధించగా, గాబ్రియెల్ ఒక వికెట్‌తో సరిపుచ్చుకున్నాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ బ్రాత్‌వైట్ 2 పరుగులకే నిష్క్రమించగా, నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ చంద్రిక 25 పరుగులు సాధించి వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 58 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో డారెన్ బ్రావో క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ మిగిలిన బ్యాట్స్‌మన్ల నుంచి అతనికి సరైన సహకారం లభించలేదు. ఆసీస్ బౌలర్ల ధాటికి నిలబడలేక మర్లాన్ శామ్యూల్స్ (9), బ్లాక్‌వుడ్ (0), దినేష్ రామ్‌దిన్ (8) జాసన్ హోల్డర్ (15) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగు తీశారు. దీంతో వెస్టిండీస్ జట్టు 116 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే బ్రావో (94), కెమర్ రోచ్ (31) జాగ్రత్తగా ఆడి అజేయంగా 91 పరుగుల భాగస్వామ్యాన్ని అందించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు సాధించిన వెస్టిండీస్ జట్టు ఇంకా 376 పరుగులు వెనుకబడి ఉంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియోన్ మూడు వికెట్లు కైవసం చేసుకోగా, జోష్ హాజెల్‌వుడ్ రెండు వికెట్లు, పీటర్ సిడిల్ ఒక వికెట్ చొప్పున సాధించారు.

ఆడమ్ వోగ్స్ (269-నాటౌట్)