క్రీడాభూమి

షాకయ్యా.. డోపింగ్ పరీక్షలో వైఫల్యంపై స్టర్మ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెర్లిన్, ఏప్రిల్ 17: గత ఫిబ్రవరిలో రష్యాకు చెందిన ఫెడర్ చుడినోవ్‌పై తాను విజయం సాధించిన తర్వాత తాను ఒక నిషేధిత ఉత్ప్రేరకాన్ని వాడినట్లు పరీక్షలో తేలడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రపంచ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్ ఫెలిక్స్ స్టర్మ్ చెప్పారు. జర్మనీకి చెందిన 37 ఏల్ల స్టర్మ్ గత ఫిబ్రవరి 20న ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్ టైటిల్‌కోసం చుడినోవ్‌పై విజయం సాధించిన తర్వాత ఇచ్చిన ఎ శాంపిల్‌లో అతను నిషేధిత ఉత్ప్రేరకం హైడ్రో-ఎక్స్‌వై స్టానోజోలోల్ వాడినట్లు పరీక్షలో తేలింది. ఈ విజయంతో అతను అయిదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తొలి జర్మన్ అయ్యాడు. డోప్ పరీక్షలో తాను విఫలమైనట్లు గత శుక్రవారం రాత్రి ప్రపంచ బాక్సింగ్ అసోసియేషన్‌నుంచి ఇ-మెయిల్‌ద్వారా తెలుసుకున్నప్పుడు తాను తొలుత దిగ్భ్రాంతికి గురయ్యానని స్టర్మ్ చెప్పాడు. ముఖ్యంగా ఫలితం వెల్లడించడానికి ఎనిమిది వారాలు సమయం తీసుకోవడం చాలా వింతగా అనిపించిందని ఆయన అన్నాడు. ఈ పోటీని ఏర్పాటుచేసిన జర్మన్ ప్రొఫెషనల్ బాక్సర్స్ అసోసియేషన్ (బిడిబి)కు ఈ విషయంయం తెలియజేయలేదని, తనకు, తన ట్రైనర్‌గా మాత్రమే తెలియజేయడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నాడు. ఒక వేళ బి శాంపిల్‌లో కూడా ఇదే ఫలితం వస్తే స్టర్మ్‌పై రెండేళ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. అంటే అతని కెరీర్ దాదాపుగా ముగిసినట్లే భావించవచ్చు. అయితే తాను తప్పకుండా బి శాంపిల్ పరీక్షకు వెళ్తానని ఆయన చెప్పాడు. తాను వందల సార్లు రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకున్నానని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అనుమానాస్పదమైంది ఏదీ కనిపించలేదని కూడా స్టర్మ్ చెప్పాడు.

‘లయన్స్’ ఆల్ రౌండర్
బ్రావోకు మందలింపు
అంపైర్ పట్ల అసహనమే కారణం
ముంబయి, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల అసహనాన్ని వ్యక్తం చేసినందుకు గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ డ్వెన్ బ్రావోను మ్యాచ్ రిఫరీ మందలించాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ 3 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను ఓడించి ప్రస్తుత ఐపిఎల్ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనావళిలోని ఆర్టికల్ 2.1.5 కింద మొదటి స్థాయి (లెవెల్ 1) నేరానికి పాల్పడిన మాట నిజమేనని బ్రావో అంగీకరించడంతో పాటు శిక్షకు ఒప్పుకున్నాడని ఐపిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మ్యాచ్‌లో 39 పరుగులిచ్చి ఒక వికెట్ రాబట్టిన బ్రావో ఆ తర్వాత 6 బంతుల్లో కేవలం రెండు పరుగులు సాధించి జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో పార్థివ్ పటేల్‌కు దొరికిపోయాడు.