క్రీడాభూమి

మూడవ మ్యాచ్‌లో పంజాబ్ బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎట్టకేలకు బోణీ చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇంతకుముందు వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆ జట్టు ఆదివారం మొహాలీలోని సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు రాబట్టగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించి మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడి కింగ్స్ ఎలెవన్ విజయంలో కీలకపాత్ర పోషించిన మనన్ వోహ్రా (33 బంతుల్లో 51 పరుగులు) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు. అంతకుముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ డేవిడ్ మిల్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన పుణె సూపర్ జెయింట్స్ ఆరంభంలో తడబడింది. ఓపెనర్ రహానే (9)తో పాటు ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ (15), సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ థిసార పెరీరా (8) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగెత్తడంతో 76 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ తరుణంలో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ ఫఫ్ డుప్లెసిస్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ స్టీవెన్ స్మిత్ బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలు ఎంతోసేపు ఫలించలేదు. నాలుగో వికెట్‌కు 63 పరుగులు జోడించిన తర్వాత స్మిత్ (26 బంతుల్లో 38 పరుగులు) మొహిత్ శర్మ బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌కు దొరికిపోగా, కొద్దిసేపటికి డుప్లెసిస్ ((53 బంతుల్లో 67 పరుగులు) కూడా మొహిత్ శర్మ బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (1), ఇర్ఫాన్ పఠాన్ (2) స్వల్పస్కోర్లకే పెవిలియన్‌కు చేరగా, రవిచంద్రన్ అశ్విన్ (1) అజేయంగా నిలిచాడు. దీంతో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు రాబట్టింది.
అనంతరం 153 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఓపెనర్లు మురళీ విజయ్, మనన్ వోహ్రా చక్కటి శుభారంభాన్ని అందించారు. క్రీజ్‌లో నిలదొక్కుకుని పుణె బౌలర్లను సమర్ధవంతంగా ప్రతిఘటించిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరిస్తూ చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు 97 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. అనంతరం వోహ్రా (33 బంతుల్లో 51 పరుగులు) అంకిత్ శర్మ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత షాన్ మార్ష్ (6 బంతుల్లో 4 పరుగులు), మురళీ విజయ్ (49 బంతుల్లో 53 పరుగులు), డేవిడ్ మిల్లర్ (6 బంతుల్లో 7 పరుగులు) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ చివర్లో అత్యంత దూకుడుగా ఆడిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (14 బంతుల్లో 32 పరుగులు), వృద్ధిమాన్ సాహా (4 బంతుల్లో 4 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో సూపర్ జెయింట్స్‌ను మట్టికరిపించింది. ప్రస్తుత సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయిపై విజయం సాధించిన సూపర్ జెయింట్స్‌కు ఆ తర్వాత ఇది వరుసగా రెండో ఓటమి.

‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’
వోహ్రా (33 బంతుల్లో 51 పరుగులు)

సంక్షిప్తంగా స్కోర్లు
రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 152/7 (్ఫఫ్ డుప్లెసిస్ 67, స్టీవెన్ స్మిత్ 38, కెవిన్ పీటర్సన్ 15, అజింక్యా రహానే 9, థిసార పెరీరా 8). వికెట్ల పతనం: 1-10, 2-65, 3-76, 4-139, 5-149, 6-149, 7-152. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-23-2, కైల్ అబ్బాట్ 4-0-38-1, అక్షర్ పటేల్ 3-0-26-0, ప్రదీప్ సాహు 4-0-31-0, మొహిత్ శర్మ 4-0-23-3, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1-0-3-0.
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇన్నింగ్స్: 18.4 ఓవర్లలో 153/4 (మురళీ విజయ్ 53, మనన్ వోహ్రా 51, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 32-నాటౌట్, డేవిడ్ మిల్లర్ 7). వికెట్ల పతనం: 1-97, 2-103, 3-112, 4-119. బౌలింగ్: ఇశాంత్ శర్మ 3-0-26-0, అంకిత్ శర్మ 4-0-27-1, రవిచంద్రన్ అశ్విన్ 4-0-27-0, మురుగన్ అశ్విన్ 4-0-36-3, ఇర్ఫాన్ పఠాన్ 1-0-7-0, థిసార పెరీరా 2.4-0-30-0.

మురళీ విజయ్ (49 బంతుల్లో 53 పరుగులు)