క్రీడాభూమి

సన్‌రైజర్స్‌కు తొలి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, ఏప్రిల్ 18: తాజా ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈ జట్టు హోంగ్రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచింది. ముంబయితో మొదట బ్యాటింగ్ చేయించి, ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులకు కట్టడి చేసింది. బరీందర్ శరణ్ మూడు వికెట్లు పడగొట్టి ముంబయిని గట్టిదెబ్బ తీశాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ మరో 15 బంతులు మిగిలి ఉండగానే అందుకోవడంలో డేవిడ్ వార్నర్ ముఖ్యభూమిక పోషించాడు. మూడు వికెట్ల నష్టానికే 145 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది.
టాస్ గెలిచి ఫీల్డింగ్
సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకోగా, ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను పార్థీవ్ పటేల్‌తో కలిసి ఆరంభించిన మార్టిన్ గుప్టిల్ కేవలం రెండు పరుగులు చేసి, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నమన్ ఓఝా క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. మొదటి ఓవర్ నాలుగో బంతికే వికెట్ కూలడంతో కంగుతిన్న ముంబయిని ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగు వీరుడు అంబటి రాయుడు ఆదుకున్నాడు. పార్థీవ్ 12 బంతుల్లో 10 పరుగులు చేసి బరీందర్ శరణ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఐదు పరుగులు చేసి రనౌట్‌కాగా, జొస్ బట్లర్ 11 పరుగులు సాధించి, శరణ్ బౌలింగ్‌లో నమన్ ఓఝాకు చిక్కాడు. 60 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకున్న ముంబయికి రాయుడుతోపాటు కృణాల్ పాండ్య అండగా నిలిచాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. వికెట్ల పతనాన్ని అడ్డుకొని, 49 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 54 పరుగులు చేసిన రాయుడును మోజెస్ హెన్రిక్స్ క్యాచ్ అందుకోగా శరణ్ అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. కృణాల్ సోదరుడు హార్దిక్ పాండ్య రెండు పరుగులకే ముస్త్ఫాజుర్ రహ్మాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ముంబయి 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 142 పరుగులు సాధించగా, అప్పటికి హర్భజన్ సింగ్ (1)తో కలిసి నాకౌట్‌గా ఉన్న కృణాల్ 28 బంతుల్లో 49 పరుగులు (మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) సాధించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో శరణ్ 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, ముస్త్ఫాజుర్ రహ్మాన్ చెరొక వికెట్ సాధించారు.
ధావన్ విఫలం.. వార్నర్ విజృంభణ
వరుసగా విఫలమవుతున్న సన్‌రైజర్స్ స్టార్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. అయతే, డేవిడ్ వార్నర్ విజృంభించి జట్టును గెలిపించాడు. కేవలం రెండు పరుగులు చేసిన ధావన్ టిమ్ సౌథీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో వచ్చిన మోజెస్ హెన్రిక్స్ బాధ్యతగా ఆడుతూ వార్నర్‌తో కలిసి రెండో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. అతను 22 బంతుల్లో 20 పరుగులు చేసి, సౌథీ బౌలింగ్‌లోనే పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. కొత్త బ్యాట్స్‌మన్ ఇయాన్ మోర్గాన్‌తో కలిసి వార్నర్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. 42 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసిన అతను 14.1 ఓవర్లలో జట్టు స్కోరు వంద పరుగులకు చేర్చాడు. ఆ తర్వాతి బంతికే మోవర్గాన్ వికెట్ కూలింది. అతను 11 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద సౌథీ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అనంతరం దీపక్ హుడాతో కలిసి వార్నర్ 17.3 ఓవర్లలో జట్టును విజయ లక్ష్యానికి చేరాడు. సన్‌రైజర్స్ విజయం సాధించే సమయానికి అతను 59 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 59, దీపక్ హూడా 9 బంతుల్లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.
సంక్షిప్త స్కోర్లు
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 (అంబటి రాయుడు 54, కృణాల్ పాండ్య నాటౌట్ 49, బరీందర్ శరణ్ 3/28).
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 145 (డేవిడ్ వార్నర్ నాటౌట్ 90, మోజెస్ హెన్రిక్స్ 20, దీపక్ హూడా నాటౌట్ 17).

చిత్రం సన్‌రైజర్స్‌ను గెలిపించిన డేవిడ్ వార్నర్
(90 నాటౌట్)