క్రీడాభూమి

బిడబ్ల్యుఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 11: ప్రపంచ బాడ్మింటన్ సమాఖ్య (బిడబ్ల్యుఎఫ్) ఆధ్వర్యాన దుబాయ్‌లో జరుగుతున్న సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్ పోరు ముగిసిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల, పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లలో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇంతకు ముందు గురువారం ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి క్రీడాకారిణి కరోలినా మారిన్‌ను మరోసారి మట్టికరిపించడంతో ఈ టోర్నీలో సెమీస్‌కు చేరే ఆశలను సైనా సజీవంగా నిలబెట్టుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతున్న సైనా గురువారం అర్థరాత్రి ఇక్కడి హమ్దాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 75 నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో 23-21, 9-21, 21-12 గేముల తేడాతో కరోలినాపై విజయం సాధించింది. అయితే సెమీస్‌కు చేరడానికి శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉండిన సైనా చైనీస్ తైపేకి చెందిన తాయ్ జు యింగ్ చేతిలో అనూహ్యంగా పరాజయం పాలయి టోర్నమెంట్‌నుంచి నిష్క్రమించింది. తొలి సెట్‌ను 21-16 తేడాతో గెలుచుకున్న సైనా ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేక మిగతా రెండు సెట్లను 18-21, 14-21 స్కోరుతో చేజార్చుకుంది. కాగా, భారత్‌కు చెందిన మరో షట్లర్ కిదాంబి శ్రీకాంత్ వరుసగా మూడో పరాజయాన్ని ఎదుర్కోవడం అభిమానులను నిరాశపర్చింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో కొనసాగుతున్న శ్రీకాంత్ శుక్రవారం చివరి లీగ్‌లో మ్యాచ్‌లో సైతం చైనీస్ తైపీకి చెందిన చౌ తీన్-చెన్ చేతిలో 17-21, 13-21 తేడాతో వరస సెట్లలో పరాజయం పాలయ్యాడు. అంతకు ముందు గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 6వ ర్యాంకర్ విక్టర్ ఎక్సెల్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. కేవలం 37 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో ఎక్సెల్సన్ 21-13, 21-18 తేడాతో విజయం సాధించాడు.