క్రీడాభూమి

లియోనెల్ మెస్సీ గొప్ప ఆటగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 12: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ గొప్ప ఆటగాడని, అతనికే తాను తొలి ప్రాధాన్యత ఇస్తానని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అన్నాడు. అయితే, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ ఈ నాలుగు జట్లు రష్యా వరల్డ్ కప్‌లో ఫేవరెట్లుగా నిలుస్తాయని పేర్కొన్న ఛెత్రీ అర్జెంటీనా మాత్రం ఆ కోవలోకి రాదని వ్యాఖ్యానించాడు. తన దృష్టిలో ఈ నాలుగు జట్లు గొప్పవని అన్నాడు. ఇంగ్లాండ్ కూడా దూసుకువస్తోందని, మరోవైపు బెల్జియం కూడా గొప్ప జట్టు అని పేర్కొన్నాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లియోనెల్ మెస్సీకే తాను ఓటేస్తానని, అంతటి గొప్ప ఆటగాడు ఎక్కడా దొరకడని, అతను తనను ఎంతగానే అభిమానించే ప్రపంచంలోని అభిమానుల కోసమే ఉన్నాడని అన్నాడు. ‘మెస్సీ మ్యాచ్‌లో ఎక్కువ స్కోర్లు చేస్తే ఆనందించేవారిలో నేనొకడిని. నేను అతని అభిమానిని. అలాగని ఇంకొకరితో మెస్సీని పోల్చలేను. అర్జెంటీనా కూడా బాగా ఆడాలని ఆశిస్తాను’ అని ఛెత్రీ పేర్కొన్నాడు. అర్జెంటీనా ఆటగాడిగా వరల్డ్ కప్‌ను మెస్సీ ఎప్పుడూ గెలవలేదని చాలామంది అంటుంటారని, కానీ అతను ఫుట్‌బాల్ ఆటలోనే అద్భుత ఆటగాడని తన అభిప్రాయమని అన్నాడు.ఇపుడు జరుగనున్న రష్యా వరల్డ్ కప్ స్టార్ ఆటగాళ్లు మెస్సీ లేదా రొనాల్డో వంటివారికి ఆఖరిది కానే కాదని తన అభిప్రాయమని, వారు శారీరకంగా ఎంతో ఫిట్‌గా ఉన్నారని, కనుక మరికొంతకాలం ఆడేందుకు అవకాశం ఉంటుందని అన్నాడు.
ఆసియా కప్ ఓ ప్రత్యేకం
ఇటీవల ముంబయిలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో సాధించిన ఘన విజయం రానున్న ఆసియా కప్‌లో మరింత ఉత్సాహంగా ఆడేందుకు దోహదపడుతుందని, కానీ ఆసియా కప్‌కు ఒక ప్రత్యేకత ఉందని భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అన్నాడు. ఆసియా కప్‌కు ముందు జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్ తమకు సన్నాహక టోర్నమెంట్‌గా అభివర్ణించాడు. కెన్యా, న్యూజిలాండ్ వంటి టీమ్‌లతో తామెప్పుడూ ఆడలేదని, అదొక ప్రత్యేకతను సంతరించుకుందని, ఈ మ్యాచ్‌లతో మరికొంచెం మెరుగైన ఆటతీరును కనబరిచామనే సంతృప్తి మిగిలిందని అన్నాడు. అయితే, ఆసియా కప్‌లో పోటీ పూర్తి భిన్నంగా ఉంటుంటుందని, ప్రపంచంలోని అగ్రశ్రేం జట్లు థాయిలాండ్, బహ్రెయిన్, యూఏఈ వంటివాటితో కనీసం రెండుమూడు లెవెల్స్ పోరాడి పైకి వెళ్లాల్సి ఉంటుందని, అందుకు తగిన విధంగా తాము సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డాడు.
వచ్చే ఏడాది జనవరి 5 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరిగే ఏఎఫ్‌సీ ఆసియా కప్‌లో గోల్ చేసినపుడే తనకు అది అభిమాన గోల్ అవుతుందని అన్నాడు. దేశం కోసం 100 గేమ్‌లు ఆడినందుకు తనకెంతో గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

చిత్రం..కోల్‌కతాలో బుధవారం జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతున్న సునీల్ ఛెత్రీ