క్రీడాభూమి

మెస్సీ ప్రాక్టీస్ మ్యాచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రోన్నిట్సీ, (రష్యా): అర్జెంటీనా సాకర్ స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే, మెస్సీని స్వయంగా చూసేందుకు ప్రతిఒక్కరూ తహతహలాడుతుంటారు. అలాంటి అవకాశం ఒరిజినల్ మ్యాచ్ కాకపోయినా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో దాదాపు 400 మంది అభిమానులకు దక్కింది. సోమవారం మెస్సీతోపాటు అతని జట్టు సహచరుల ఆటతీరును వారు కాసేపు స్వయంగా వీక్షించి ఎంతో సంబరపడ్డారు. ఈ మ్యాచ్ ఆసాంతం అభిమానులు, మద్దతుదారులు ‘మెస్సీ, మెస్సీ’ అంటూ గంటకుపై పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆటగాళ్లందర్నీ ఉత్సాహపరచడంతోపాటు వారు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. చాలారోజుల తర్వాత రష్యా రాజధానిలో వాతావారణం ఆహ్లాదకరంగా ఉండడంతో మెస్సీ అభిమానులు, మద్దతుదారులు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మెస్సీ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచాడు. మ్యాచ్‌ను తిలకించడానికి వచ్చిన మెస్సీ అభిమానులు, మద్దతుదారులు అర్జెంటీనా పతాకాలను చేతబూని హాజరుకావడం విశేషం. మ్యాచ్ అనంతరం అభిమానులు మెస్సీ సహా తమ అభిమాన ఆటగాళ్ల ఆటోగ్రాఫ్‌ల కోసం ఆటగాళ్లను చుట్టుముట్టారు. ఇదిలావుండగా, అర్జెంటీనా మిడిల్ ఫీల్డర్ మాన్యుయెల్ లాంజినీ మోకాలి నొప్పితో రానున్న మ్యాచ్‌లలో ఆడే అవకాశం లేనందున అతని స్థానంలోఎంజో పెరెజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అర్జెంటీనా తన తొలి గ్రూప్ గేమ్‌ను ఈనెల 16న ఐస్‌లాండ్‌తో ఆడనుంది. కాగా, రష్యాలో అంబాసిడర్‌గా పనిచేస్తున్న అర్జెంటీనాకు చెందిన ఎర్నెస్టో లగోరియో ఇక్కడ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ తాము ఇప్పటికి ఎన్నోసార్లు బ్రొన్నిట్సీలో పర్యటించామని, ఇక్కడి మేయర్, అధికారులు తమ అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందించారని అన్నాడు. తాము పలు జట్లతో ఎన్నో మ్యాచ్‌లలో తలపడాల్సి ఉంటుందని, ఫైనల్ మ్యాచ్ కోసం జూలై వరకు వేచి ఉండండని నవ్వుతూ అన్నాడు.

చిత్రం..ప్రాక్టీస్ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ