క్రీడాభూమి

రియోలో స్వర్ణమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఏప్రిల్ 19: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని భారత మహిళా జిమ్నాస్ట్ దీప కర్మాకర్ చెప్పింది. ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో 52.698 పాయింట్లు సాధించి, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీప పిటిఐతో మాట్లాడుతూ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో పోటీపడనున్నట్టు చెప్పింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కడం తన అదృష్టమని, ఇక్కడితో ఆగకుండా టైటిల్ సాధించడంపై దృష్టి కేంద్రీకరిస్తానని దీప తెలిపింది. భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఇప్పటి వరకూ 11 మంది జిమ్నాస్టులు మాత్రమే దేశానికి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించారు. వీరంతా పురుషులే. ఒలింపిక్స్‌లో పాల్గొనే తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప పేరు రికార్డు పుస్తకాల్లో చేరింది.