క్రీడాభూమి

బోణీకొట్టిన సెర్బియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర, జూన్ 17: ఫిఫా వరల్డ్ కప్ 2018 గ్రూప్ -ఇ క్యాటగిరీ కింద ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోస్టారికాపై సెర్బియా విజయం సాధించింది. ప్రథమార్థంలో రెండు జట్లూ హోరాహోరీ తలపడినా ఒక్క గోల్ కూడా సాధించలేకపోయాయి. ద్వితీయార్థంలో 52వ నిమిషంలో సెర్బియా స్టార్ స్ట్రయికర్ అలెగ్జాండర్ కోలరోవ్ సాధించిన గోల్‌తో 1-0 ఆధిక్యాన్ని సాధించి సెర్బియా ఆరంభ మ్యాచ్ విజయాన్ని నమోదు చేసింది. కొలరోవ్ అద్భుత నైపుణ్యంతో తన్నిన ఎడమకాలి ఫ్రీ కిక్‌ను కోస్టారికా గోల్‌కీపర్ కేలర్ నివాస్ ఏమాత్రం ఆపలేకపోయాడు. మ్యాచ్ చివరి క్షణాల్లో కొన్ని సైడ్‌లైట్స్ అభిమానుల్లో ఉత్కంఠ రేకెత్తించాయి. కోస్టారికన్ కోచ్‌తో ఆటగాడు నెమాన్జ జగడానికి దిగడంతో రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు అటువైపు పరుగులుపెట్టారు. అయితే, వివాదం త్వరగానే సమసిపోవడంతో మ్యాచ్ మామూలుగానే సాగిపోయింది. మ్యాచ్ అనంతరం కోస్టారికా డిఫెండర్ గియాన్‌కార్లో గాంజలెస్ మాట్లాడుతూ ‘వరల్డ్ కప్ గురించి గత నాలుగేళ్లుగా చాలానే మాట్లాడుకుని ఉంటారు. కానీ, ఇదో కొత్త వరల్డ్ కప్. ఇదో కొత్త చరిత్ర’ అని వ్యాఖ్యానించాడు. ‘జట్టులో తొలిసారి వరల్డ్ కప్ ఆడుతున్న వాళ్లున్నారు. మాకు తెలుసు, ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల కళ్లు వాళ్లమీద ఉంటాయని’ అంటూ గాంజలెస్ చమత్కరించాడు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో బ్రెజిల్‌ను కోస్టారికా ఎదుర్కోబోతోంది. కలినిన్‌గార్డ్‌లో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌లో స్టిట్జర్లాండ్‌ను సెర్బియా ఎదుర్కోబోతోంది.