క్రీడాభూమి

ఫెదరర్.. నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టుట్‌గార్డ్(జర్మనీ), జూన్ 17: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఈ ఏడాది రెండోసారి ప్రంపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన మెర్సిడెస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో ఫెదరర్ 6-4, 7-6 (7/3) స్కోరు తేడాతో ప్రత్యర్థి కెనడాకు చెందిన మిలోస్ రావ్‌నిక్‌పై విజయం సాధించి ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఫెధరర్ ర్యాంక్ ప్రపంచ స్ధాయిలో నంబర్ 1 ఖాయమైంది. వచ్చేనెలలో జరుగనున్న తొమ్మిదవ వింబుల్డన్‌లో కూడా ఫెదరర్ పాల్గొననున్నాడు. 2012 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో టాప్ ర్యాంక్ అందుకున్న ఫెదరర్ మే 14న స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఫెదరర్ 6-7 (2/7), 6-7, 7-6 (7/5) స్కోరు తేడాతో ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిరియోస్‌పై గెలుపొంది వరల్డ్ ర్యాకింగ్‌లో తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. జర్మనీ గ్రాస్ కోర్టులో 2016లో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టామీహస్ చేతిలో ఫెదరర్ ఓటమిపాలయ్యాడు. 36 ఏళ్ల ఫెదరర్ సోమవారం ప్రకటించనున్న ర్యాకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలుస్తాడు. 78 నిమిషాల పాటు సాగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నాడు.