క్రీడాభూమి

ప్చ్.. మిస్సయ్యావు మెస్సీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, జూన్ 17: ఫిఫా వరల్డ్ కప్ 2018లో అర్జెంటీనా ఆటగాడు లయనెల్ మెస్సీపై ఆశలు పెట్టుకున్న అభిమానులంతా, ఐస్‌లాండ్‌పై అతని ఆట తీరుచూసి విలవిల్లాడుతున్నారు. నిర్ణయాత్మక పెనాల్టీతో అర్జెంటైనాకు అనితర సాధ్యమైన విజయాన్ని అందించే అవకాశం మెస్సీకి దక్కినా, దూకుడు ప్రదర్శించటంలో ఘోరంగా విఫలమయ్యాడని సోషల్ మీడియాలో అభిమానులు అప్పుడే అసంతృప్తులు వినిపిస్తున్నారు. నిజానికి ఫిఫా వరల్డ్ కప్ ఆరంభం నుంచీ ఫుట్‌బాల్ అభిమానుల చూపులన్నీ ఇద్దరిపైనే ఉన్నాయి. ఒకరు పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో, మరొకరు అర్జెంటైనా స్టార్ ప్లేయర్ లయనెల్ మెస్సీ. గత శుక్రవారం రాత్రి స్పెయిన్ -పోర్చుగల్ ఓపెనింగ్ గేమ్‌లో పోర్చుగల్‌కు ఓటమి తప్పదనుకుంటున్న సమయంలో హ్యాట్రిక్ గోల్స్‌తో క్రిస్టియానో రోనాల్డో మ్యాచ్‌ను టై చేసి తానేంటో నిరూపించుకున్నాడు. తాజాగా పసికూనగా చెప్పుకునే ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అందివచ్చిన పెనాల్టీ అవకాశాన్ని జారవిడుచుకుని మెస్సీ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ ఇద్దరి ఫుట్‌బాల్ స్టార్ల ఆటతీరును పోల్చిచూస్తూ సోషల్ మీడియాలో పెద్దఎత్తునే కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. సమవుజ్జీ ప్రత్యర్థి క్రిస్టియానో రోనాల్డో హ్యాట్రిక్ సాధిస్తే, పెనాల్టీని విజయంగా మలచుకోవడంలో విఫలమైన మెస్సీ ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటాడన్న అంశంపై పెద్ద చర్చే నడిచింది. ‘పెనాల్టీ షాట్‌ను వినియోగించుకునే చివరి క్షణంలో మార్చుకున్న నిర్ణయమే కొంపముంచింది. వాస్తవానికి పెనాల్టీ మిస్సవ్వడం చాలా బాధించింది. గొప్ప విజయంతో ఆటను ప్రారంభించటం చాలా ముఖ్యం. ఈ విషయంలో విఫలమయ్యాం. ఇప్పుడిక క్రొయేషియా గురించే ఆలోచిస్తున్నా. ఈ వైఫల్యం మరోసారి ఎదురుకానివ్వను’ అంటూ మెస్సీ వ్యాఖ్యానించటం చూస్తుంటే, పెనాల్టీ మిస్సయిన బాధ అతనిలో ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అయితే, మెస్సీ పెనాల్టీ షాట్‌ను సమర్థంగా ఎదుర్కొని ఐస్‌లాండ్ గోల్‌కీపర్ హేన్స్ హాల్డర్‌సన్ వరల్డ్ కప్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. మాస్కోలోని స్పార్టక్ స్టేడియంలో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ను టై చేసి అర్జెంటైనాకు సమవుజ్జీగా ఐస్‌లాండ్‌ను నిలపటంలో గోల్‌కీపర్ హేన్స్‌దే పెద్ద పాత్ర. అర్జెంటైనా స్టార్ ఆటగాడు లయనెల్ మెస్సీ పెనాల్టీ షాట్‌ను సమర్థంగా అడ్డుకుని 1-1 స్కోరుతో మ్యాచ్‌ను డ్రా చేసి హీరో అనిపించుకున్నాడు. ‘అర్జెంటైనాతో మ్యాచ్ డ్రా అవ్వడం అంటే ఐస్‌లాండ్ గెలిచినట్టే’ అంటూ హేన్స్ తన ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. మెస్సీ పెనాల్టీ షాట్‌ను అడ్డుకున్న మరుక్షణం హేన్స్ చేసిన వ్యాఖ్య ఒక్కటే.. ‘కల నిజమైంది’ అని. ‘ఏదోక క్షణంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని నాకు తెలుసు. అందుకే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో ఒకింత హోంవర్క్ చేసుకునే వచ్చాను. నిజానికి మెస్సీ లాంగ్ షాట్‌ను ఆపడంలో నేను విజయం సాధించాను’ అంటూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన హేన్స్ వ్యాఖ్యానించాడు. ‘నిజానికి మెస్సీ నుంచి చాలా పెనాల్టీ షాట్‌లో ఎదుర్కొన్నా. కానీ, చివరి రెండు పెనాల్టీ షాట్స్ ఎదుర్కొనే సమయంలో నా ప్రవర్తన నాకే కొత్తగా అనిపించింది’ అంటూ హేన్స్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచంలోనే అద్భుతమైన టీంలతో ఆడే అవకాశం వచ్చింది. అంతేకాదు, అద్భుతమైన ఆటగాళ్లతోనూ ఆడటం ఆనందంగా ఉంది’ అంటూ హేన్స్ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ను డ్రా చేసి అర్జెంటైనాతో సమవుజ్జీ అనిపించుకున్న ఐస్‌లాండ్, తన తదుపరి మ్యాచ్‌ను వచ్చే శుక్రవారం వోల్గోగార్డ్ స్టేడియంలో నైజీరియాతో ఆడనుంది.