క్రీడాభూమి

మెస్సీ, రొనాల్డోతో పోల్చకండి: ఆడ్రిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రటోవో (రష్యా), జూన్ 17: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫుట్‌బాల్ ఆటగాళ్లు లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలతో తనను పోల్చవద్దని పోర్చుగల్ స్టార్ ఆటగాడు ఆడ్రిన్ సిల్వా కోరాడు. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభమైన ప్రథమార్థంలో జరిగిన మ్యాచ్‌లలో మెస్సీ, రొనాల్డో తమ అద్భుత ఆటతీరుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారని అన్నాడు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-3తో డ్రా చేసుకోవడంలో రొనాల్డో హ్యాట్రిక్ సాధించాడని అన్నాడు. అదేవిధంగా మరోవైపు ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ పెనాల్టీని మిస్ అయినా 1-1తో మ్యాచ్‌ను ముగించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇలాంటి అద్భుత ఫామ్ కనబరుస్తున్న మెస్సీ, రొనాల్డోలతో తనను ఏమాత్రం పోల్చడం తగదని అన్నాడు లీసెస్టర్ సిటీ మిడిల్‌ఫీల్డర్ సిల్వ. తమ టీమ్‌కు మంచి నాయకుడు ఉన్నాడని, అతను ఎల్లప్పుడూ తమకు అండగా నిలుస్తాడని, తన శక్తివంచన లేకుండా పోరాడడంలో దిట్ట అని మెస్సీని ఉద్దేశించి అన్నాడు. గత మ్యాచ్‌లో తమ జట్టు సభ్యులమంతా ప్రతిక్షణం ఆస్వాదించామని అన్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు 51 సార్లు ఆడిన రొనాల్డో వివిధ టోర్నమెంట్లలో అత్యధిక స్కోరు సాధించిన నాలుగో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడని తెలిపాడు. రొనాల్డో లేకుండా తాము ఉత్తమ ఫలితం సాధించడం కష్టసాధ్యమని, అతను తమ జట్టుకు అండగా ఉన్నందున విజయం సాధిస్తామనే ధీమా ఉందని పేర్కొన్నాడు.