క్రీడాభూమి

డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ఒక మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. లక్షలాదిమంది క్రీడాభిమానులు తమపై పెట్టుకున్న ఆశలను డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ నీరుగార్చింది. ఫలితంగా ప్రత్యర్థి మెక్సికోతో ఆడిన ప్రారంభ మ్యాచ్‌లోనే 1-0 తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం ఇక్కడి లుజునికీ స్టేడియంలో జరిగ్ని రెండో మ్యాచ్‌లో గ్రూప్-ఎఫ్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ, మెక్సికో జట్లు తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్‌లో జర్మనీకి ప్రత్యర్థి గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ ప్రారంభంలో జర్మనీ ఆధిపత్యం కొనసాగినప్పటికీ క్రమంగా ఆటపై పట్టు నిలబెట్టుకోలేక గోల్ చేయడంలో విఫలమైంది. మరోవైపు ఒక్కసారిగా దూకుడును పెంచిన మెక్సికో ఆట 35వ నిమిషంలో కళ్లు చెదిరే గోల్ సాధించింది. ఈ జట్టులోని హెరింగ్ లొజానో అద్భుత గోల్ చేయడంతో మెక్సికో ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఆట తొలి అర్ధ్భాగం ముగిసేసరికి మెక్సికో జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ్భాగంలోనూ మెక్సికో అదే దూకుడును కొనసాగించింది. జర్మనీ ఆటగాళ్లు గోల్ చేయడానికి, తద్వారా ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలన్నింటినీ మెక్సికో సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. ఆ తర్వాత మెక్సికో చేసిన గోల్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.