క్రీడాభూమి

హోంగ్రాండ్‌లో పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి జట్టు మొదటి మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌తో తలపడి 9 వికెట్ల తేడాతో చిత్తయింది. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. మూడో మ్యాచ్‌లో గురజాత్ లయన్స్‌ను ఢీకొని, చివరి వరకూ పోరాడినప్పటికీ మూడు వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తాజాగా సన్‌రైజర్స్ చేతిలో ఊహించని ఓటమిని ఎదుర్కొంది.
ముంబయితో సన్‌రైజర్స్ ఏడుసార్లు తలపడింది. మూడు మ్యాచ్‌లను గెల్చుకోగా, నాలుగు మ్యాచ్‌లను చేజార్చుకుంది. కాగా, ఈ ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 45 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై విజయాలను నమోదు చేశాయి. హోం గ్రౌండ్‌లో ముంబయతో జరిగిన మ్యాచ్‌లో సంచలనం సృష్టించింది. ఈసారి ఐపిఎల్‌లో తొలి విజయాన్ని దక్కించుకుంది.

ముంబయి, ఏప్రిల్ 19: ఈసారి ఐపిఎల్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి, నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశ పరుస్తున్న ముంబయి ఇండియన్స్ జట్టుకు బుధవారం హోం గ్రౌండ్‌లోనే పరీక్ష ఎదురుకానుంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో పటిష్టంగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఢీకొంటున్న ముంబయిలో ఆత్మవిశ్వాసం కనిపించడం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, పార్థీవ్ పటేల్, అంబటి రాయుడు, జొస్ బట్లర్, కృణాల్ పాండ్య వంటి సమర్థులైన బ్యాట్స్‌మెన్ ముంబయిలో ఉన్నప్పటికీ బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తున్నది. మిచెల్ మెక్‌క్లీనగన్, టిమ్ సౌథీ కొంత వరకు ప్రత్యర్థులను నిలువరించే సత్తావున్నవారే. కానీ, మిగతా వారు ఆ మాత్రం ఒత్తిడిని కూడా తేలేకపోతున్నారు. ముంబయి జట్టులో ఎవరు, ఎప్పుడు, ఏ విధంగా రాణిస్తారో, ఎప్పుడు విఫలమవుతారో చెప్పలేని పరిస్థితి. ఈ దశలో బెంగళూరును రోహిత్ బృందం ఎంత వరకూ ఎదుర్కొంటుందన్నది అనుమానమే.
మరోవైపు బెంగళూరును విశే్లషకులు హాట్ ఫేవరిట్‌గా ముద్ర వేస్తున్నారు. భార్య ప్రసవ వేదనతో ఆసుపత్రిలో చేరడంతో క్రిస్ గేల్ స్వదేశానికి వెళ్లాడు. అతను రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం లేదు. ఈ ఒక్క అంశాన్ని మినహాయిస్తే, ఆ జట్టు ఎదుర్కొంటున్న సమస్యలు దాదాపుగా ఏవీ లేవని చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ముంబయిపై బెంగళూరు విజయం ఖాయంగా కనిపిస్తున్నది.