క్రీడాభూమి

మీ ఆటంటే మాకిష్టం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 18: ఫిఫా వరల్డ్ కప్ -2018లో లియోనాల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, నేమర్‌కు ఉన్న క్రేజు తక్కువేంకాదు. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు ప్రపంచవ్యాప్తంగావున్న పిచ్చి అభిమానుల సంఖ్య కోట్లలోనే ఉంటుందేమో. వివిధ క్రీడలకు సంబంధించిన ఆటగాళ్లు సైతం ఈ సీజన్‌లో సమయం దొరికితే వీళ్ల మ్యాచ్‌లను కళ్లప్పగించి చూడ్డానికే ఇష్టపడతారనడంలో సందేహం లేదు. వివిధ క్రీడలకు సంబంధించిన భారత ఆటగాళ్లు సైతం అందుకు మినహాయింపేమీ కాదు. బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమర్‌ను ఫాలో అయిపోతున్నా అంటున్నాడు క్రికెటర్ కుల్దీప్ యాదవ్. 2014 ఫిఫా వరల్డ్ కప్‌లో నేమర్ నిరాశపర్చినా, అప్పటి అసంతృప్తి చెరిగిపోయేలా ఆటతీరు ప్రదర్శిస్తాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డోను ఫాలో అయిపోతున్నారు బాక్సర్ అఖిల్ కుమార్, గోల్ఫర్ రాహిల్ గాంగ్జీలు. ఇక అర్జెంటీనా ఆటగాడు లియోనాల్ మెస్సీని షటిల్ బ్యాడ్మింటన్ ఆటగాడు హెచ్‌ఎస్ ప్రణయ్ ఫాలో అవుతుంటే, ఈసారి ఫిఫా కప్‌ను జర్మనీ తన్నుకుపోయే అవకాశం ఉందంటున్నాడు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ సింగ్. అనుభవం కలిగిన యువ ఆటగాళ్లతో జర్మనీ జట్టు బలంగా ఉంది. ఈసారి తన సత్తా చూపే అవకాశం ఉండొచ్చన్నది సందీప్ సింగ్ మాట.
ఆఫ్గనిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ప్రతిభ కనబర్చిన క్రికెటర్ కుల్దీప్ ఇప్పుడు ఫిఫా వరల్డ్ కప్ మూడ్‌లో ఉన్నాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లనున్న కుల్దీప్, ‘్ఫఫా వరల్డ్ కప్‌లో నా ఫేవరేట్ టీం బ్రెజిల్. ఎందుకంటే, ఆ జట్టులో నేమర్ ఉన్నాడు. నిజానికి మాకిప్పుడు బిజీ క్రికెట్ సీజన్. అయినప్పటికీ సాధ్యమైనంత వరకూ ఎక్కువ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసేందుకు ప్రయత్నిస్తున్నా. నా ఫేవరేట్ బ్రెజిల్‌ను సపోర్ట్ చేస్తున్నా’ అంటున్నాడు. నేమర్ అంటే ఎందుకంత ఇష్టం అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ‘అతని ఆట స్టయిల్, గేమ్‌పట్ల అతని దృక్పధం నన్ను అట్రాక్ట్ చేస్తాయి’ అన్నాడు. వరల్డ్ కప్ మ్యాచ్‌లు లైవ్‌లో చూడాలన్నది నా కల. ఏదోక రోజు అది నెరవేరుతుందనే అనుకుంటున్నా అంటూ ఫుట్‌బాల్ మ్యాచ్‌ల పట్ల కుల్దీప్ తన ఆసక్తిని వ్యక్తపర్చాడు. కామనె్వల్త్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణాన్ని సాధించిన బాక్సర్ అఖిల్ సైతం ఇదే తరహా అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ‘క్రిస్టియానో రోనాల్డోకి నేను పెద్ద అభిమానిని. అతని ఆట తీరు ఎలావుంటుందో ఇప్పటికే స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో చూశాం. మైదానంలో అతని ఫుట్‌బాల్ మ్యాజిక్‌కే కాదు, మైదానం వెలుపల అతను చేపట్టే సోషల్ వర్క్‌కి కూడా నేను అభిమానిని. ఈ వరల్డ్ కఫ్‌లో నేను కచ్చితంగా పోర్చుగల్‌నే సపోర్ట్ చేస్తా’ అంటూ రోనాల్డో పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు అఖిల్. రెండుసార్లు ఆసియన్ టూర్ విన్నర్‌గా నిలిచిన గాంగ్జీ సైతం రొనాల్డో పట్ల ఇదే తరహా అభిమానాన్ని వ్యక్తం చేశాడు. ‘ఆటలో అతని వేగం, నైపుణ్యం, అంకితభావం మనల్ని పిచ్చెక్కిస్తాయి. పోరాట పటిమ విషయంలో పోర్చుగల్ టీం ప్రదర్శించే అంకితభావాన్ని తక్కువ చేయలేం. అందుకే నా ఫేవరేట్ టీం పోర్చుగల్’ అని 40ఏళ్ల గాంగ్జీ పేర్కొన్నాడు. ఐదారేళ్ల వయసులోనే తన మామయ్యతో కలిసి మారిషస్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసిన జ్ఞాపకాలు ఉన్నాయని, అందుకే ఇప్పటికీ తన పిల్లలతో కలిసి వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూంటానని ఆయన పేర్కొన్నాడు. చిన్నతనం నుంచే అర్జెంటైనా జట్టుకు తాను అభిమానినని, ఇప్పుడు మెస్సీ కారణంగా అర్జెంటైనాపై తన అభిమానం మరింత పెరిగిందన్నది పాతికేళ్ల షటిల్ బ్యాడ్మింటన్ ఆటగాడు ప్రణయ్ చెబుతున్న మాట. ‘వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్స్‌కు జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్, బెల్జియం చేరుకోవచ్చు. మెస్సీ తన నైపుణ్యంతో అర్జెంటీనాను అగ్రస్థానంలో నిలబెడతాడని నమ్ముతున్నా’ అంటున్నాడు ప్రపంచస్థాయిలో 8వ ర్యాంకర్‌గావున్న ప్రణయ్. ఇక జర్మనీని సపోర్ట్ చేస్తున్న హాకీ జట్టు మాజీ కెప్టెన్ సందీప్, అందుకు కారణం జర్మనీ కోచ్ జోకిమ్ లియోనట. ‘జర్మన్ కోచ్ జోకిమ్ లియో జట్టుకు శిక్షణనిచ్చే విధానం అద్భుతం. వరల్డ్ కప్‌లో జర్మనీ మంచి విజయాలు సాధిస్తుందని బలంగా నమ్ముతున్నా. అంతేకాదు, జర్మనీ జట్టునిండా అనుభవజ్ఞులైన యువ ఆటగాళ్లు ఉన్నారు. తమ ఆటతీరుతో సరైన విజయాలు నమోదు చేస్తారు’ అంటున్నాడు సందీప్.