క్రీడాభూమి

రొమేలు మర్చిపోలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోచి, జూన్ 18: ఫిఫా వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బెల్జియం బోణీ చేసింది. సోమవారం ఇక్కడి ఫిస్ట్ స్టేడియంలో గ్రూప్-జీ మ్యాచ్‌లో ప్రత్యర్థి పనామాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. బెల్జియం స్ట్రయికర్ రొమేలూ లుకాకు 69.75 నిమిషాల్లో రెండు గోల్స్ చేయడంతో బెల్జియం అలవోకగా గెలుపొందింది. మ్యాచ్ ప్రారంభం నుంచి తొలి అర్ధ్భాగం వరకు ఇరు జట్లు గోల్ చేయడానికి ఎన్నివిధాలుగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. ఆట అర్ధ్భాగం సమయంలో పనామా కీపర్ జైమె పెనెడో బెల్జియం ఆటగాళ్లను అడ్డుకోడానికి విఫలయత్నం చేసి జట్టులో హీరోగా మారాడు. ఆట ద్వితీయార్ధం ప్రారంభమైన వెంటనే 47వ నిమషంలో డ్రెస్ మెర్టెన్స్ తొలి గోల్ చేసి బెల్జియంకు ఆధిక్యం అందించాడు. ఒకవిధంగా మ్యాచ్‌ను బెల్జియం జట్టు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్టయింది. ప్రత్యర్థి ఆటగాళ్ల దూకుడును తట్టుకోలేక ఎలాగైనా డిఫెన్స్ ఇవ్వాలని భావించిన పనామా ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో దీనిని అవకాశంగా మల్చుకున్న బ్రెజిల్ వరల్డ్ కప్‌లో గెలుపుతో తొలి బోణీ చేసింది.