క్రీడాభూమి

ఆండ్రియాన్ ఆడేసుకున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: డిఫెండర్ ఆండ్రియాన్ గ్రాన్‌క్విస్ట్ స్వీడన్ కష్టాన్ని సులువు చేశాడు. అలుపెరుగని పోరాటాన్ని ప్రదర్శించిన సౌత్ కొరియా 65వ నిమిషంలో స్వీడన్ ముందు తలొంచక తప్పలేదు. అందివచ్చిన పెనాల్టీ షాట్‌ను సమర్థంగా గోల్ చేసి స్వీడన్ డిఫెండర్ ఆండ్రియాన్ 1-0 ఆధిక్యత సాధించాడు. ప్రథమార్థంలో రెండు జట్లూ వ్యూహాత్మక రీతిలో ఆటను సాగించటంతో, ఎవరికీ గోల్ దక్కలేదు. ద్వితీయార్థంలోనూ అదే తీరు కనిపించినా, 65వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ షాట్‌ను స్వీడన్ డిఫెండర్ గోల్ చేయగలిగాడు. మ్యాచ్‌ను డ్రా చేయాలన్న కసితో దక్షిణ కొరియా అటాకర్ సన్ హ్యూంగ్ -మిన్, హ్వాంగ్ హీ-చాన్‌లు చివరి వరకూ పోరాడినా ఫలితం రాబట్టలేకపోయారు. తరువాత ఏకోశానా ద.కొరియాకు స్వీడన్ జట్టు అవకాశమివ్వకుండా 1-0 ఆధిక్యంతో ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించింది.