క్రీడాభూమి

ఆఖరి మ్యాచ్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్ (స్పెయిన్), జూన్ 19: మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, డిఫెండర్ గుర్జీత్ కౌర్ అద్భుత ఆటతీరుతో ఇక్కడ స్పెయిన్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో భారత్ 4-1 తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో రాణీ సేన సమం చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజార్చుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ జట్టు సభ్యులు సమష్టిగా రాణించి జట్టును విజయపథంలో నిలిపారు. ఆట ప్రారంభం నుంచి దూకుడు పెంచిన భారత్ ప్రత్యర్థిని గోల్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా జోరు పెంచింది. కెప్టెన్ రాణీ రాంపాల్ 33వ, 37 నిమిషాల్లో రెండు గోల్స్ చేసింది. భారత డిఫెండర్ గుర్జీత్ 44వ, 50 నిమిషాల్లో రెండు పెనాల్టీ కార్నర్‌లను అవకాశంగా మల్చుకుని ఆడడంతో మరో గోల్ చేసి జట్టు గెలుపునకు మరింత దోహదపడింది. ఆట ముగిసే సమయంలో స్పెయిన్ క్రీడాకారిణి లోలా రియెరా 58వ నిమిషంలో కన్సొలేషన్ గోల్ చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను స్పెయిన్ గెల్చుకోగా, రెండో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడో మ్యాచ్‌లో భారత్ గెలవగా, నాలుగో మ్యాచ్‌ను స్పెయిన్ దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లో భారత్ ప్రత్యర్థిని మట్టి కరిపించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.