క్రీడాభూమి

విమానంలో మంటలు - కంగారుపడిన సౌదీ ఆటగాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోస్టోవ్-ఆన్-డాన్, జూన్ 19: రష్యాలో అట్టహాసంగా సాగుతోన్న సాకర్ సంరంభంలో సోమవారం అర్థరాత్రి చిన్న అపశ్రుతి చోటుచేసుకుంది. వరల్డ్ కప్‌కు ఆతిధ్యమిస్తున్న రష్యాలో మ్యాచ్‌ల కోసం సుదూర ప్రాంతాల్లో మైదానాలు ఏర్పాటు చేశారు. ఒకచోట మ్యాచ్ పూర్తి చేసుకున్న జట్టు మరో మ్యాచ్ కోసం మరో ప్రాంతానికి తరలి వెళ్లక తప్పదు. అలా తదుపరి మ్యాచ్ కోసం రోస్టోవ్ ఆన్ డాన్‌కు వెళ్లేందుకు సౌదీ అరేబియా జట్టు ఎక్కిన విమానంలో మంటల చెలరేగడంతో ఆటగాళ్లు తీవ్ర భయాందోళనకు గురైనట్టు సౌదీ ఫుట్‌బాల్ ఫెడరేషన్ వెల్లడించింది. అయితే చిన్న ప్రమాదమే కావడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని సౌదీ జట్టు ఆటగాళ్లు పేర్కొన్నారు. ‘ల్యాండింగ్ సమయంలో విమానానికి ఎడమవైపు ఇంజన్‌లో మంటలు చెలరేగాయి. అయితే, విమానం మాత్రం సేప్‌గా ల్యాండ్ అయ్యింది’ అని సౌదీ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అహ్మద్ అల్ హర్బి సౌదీ స్పోర్ట్స్ కెఎస్‌ఏ చానెల్‌కు వెల్లడించారు. ఫెడరేషన్ ట్విట్టర్ అకౌంట్ వీడియోలో ప్రమాదంపై మాట్లాడిన సౌదీ ఆటగాడు హతన్ బహ్బీర్ ‘అంతా క్షేమంగా ల్యాండయ్యాం. విమానంలో తలెత్తిన సాంకేతిక వైఫల్యం వల్లే ఇలా జరిగింది’ అని పేర్కొన్నాడు. ‘్భయపడ్డారా?’ అంటూ అకౌంట్ ఫాలోవర్ ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘మంటలు అంటుకున్నాయని తెలిసి కొద్దిగా భయపడిన మాట వాస్తవం. క్షేమంగా దిగడంతో భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకున్నాం’ అన్నాడు. ‘సౌదీ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్లంతా క్షేమంగా ఉన్నారు. ఆందోళనకు గురికావాల్సిన పని లేదు. తలెత్తిన చిన్నపాటి సాంకేతిక సమస్యను అధిగమించి విమానాన్ని రోస్టోవ్ ఆన్ డాన్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఆటగాళ్లు తమకు కేటాయించిన ప్రాంతాలకు చేరుకున్నారు కూడా’ అని సౌదీ అరేబియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రెస్టోవ్ ఆన్ డాన్‌లో బుధవారం ఉరుగ్వే జట్టుతో సౌదీ అరేబియా జట్టు తలపడనుంది. ఆరంభ మ్యాచ్‌ను ఆతిధ్య దేశం రష్యాతో ఆడిన సౌదీ జట్టు 5-0 తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఫ్యాన్స్ ఓవరాక్షన్
మాస్కో, జూన్ 19: అభిమానం హద్దులు మీరనంతవరకూ ఫర్వాలేదు. శృతిమించి రాగాన పడితేనే ప్రమాదం. రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను వీక్షించడానికి ట్రైనులో వెళ్తున్న కొందరు ఇంగ్లాండ్ అభిమానుల వెర్రి చేష్టలు వారిని జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసింది. సోమవారం వోల్గోగ్రాడ్‌లో తునీషియాతో తమ దేశం తలపడే మ్యాచ్‌ను తిలకించేందుకు ట్రైనులో వెళ్తున్నవారిలో ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు లగేజి క్యారియర్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన సమయంలో గాయపడ్డాడు. అతనితోపాటు వచ్చిన మరో వ్యక్తి పోలీసు నిబంధనలను ఉల్లంఘించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా అతనిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.